కాన్పూర్ లో హిస్ట్రీ షీటర్, క్రిమినల్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ( Vikas Dubey ) ఎన్ కౌంటర్ తరువాత నేరస్థుల్లో వెన్నులో వణకుపుడుతోంది. ఎన్ కౌంటర్ భయంతో ఒక గ్యాంగ్ స్టర్... పోలీస్ ఇన్ స్పెక్టర్ కాళ్లు పట్టుకుని "సార్ గన్నుతో కాల్చకండి" అని వేడుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నేరస్థులపై చూపుతున్న కాఠిన్యత వల్ల మార్పు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో క్రిమినల్స్ గుండెల్లో పోలీసులంటే భక్తి గూడుకట్టుకుంది. తాజగా ఒక గ్యాంగ్ స్టర్ ఇలాగే పోలీసుల ముందు కాళ్లు పట్టుకున్ని ప్రాణభిక్ష కోసం వేడుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి


భయపడుతోన్న నేరస్థులు
యూపీ పోలీసుల (Police ) యాక్షన్ ప్లాన్ చూసి ఆ రాష్ట్రంలో ఉన్న 15 వేల మంది రౌడీల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. చాలా మంది నేరస్థులు ఇక నేరాలు చేయం ప్రాణాలతో వదిలేయండి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోతున్నారట. ఫీచర్ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి కూడా అలాగే పోలీసుల ముందు తనను కాల్చవద్దని ప్రాధేయపడ్డాడు.


ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ( Uttar Pradesh ) సంభాల్ ప్రాంతంలోని నఖాసా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సుమారు 15 వేల మంది క్రిమినల్స్ పై చర్యలు తీసుకోవడానికి పోలీసు విభాగం సిద్ధం అవుతోవంది.


ఈ తరుణంలో ఈ వ్యక్తి తన మొడలో బోర్డు పెట్టుకుని ఇక నేరాలు చేయను క్షమించి వదిలేయండి అని ఇలా పోలీసుల ముందుకు వచ్చాడు. పోలీస్ స్టేషన్ గేటు ముందుకు వచ్చి పోలీసులకు క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు. 



ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి


తన తప్పులు చెబుతున్న సమయంలో నయీమ్ అనే ఈ వ్యక్తి కి తనను కూడా వికాస్ దుబేలా ఎన్ కౌంటర్ లో ఎక్కడ కాల్చివేస్తారో అనే భయం పట్టుకుంది. తనపై విచారణ జరిగితే అనుకోనిది జరుగుతుందేమో అని భయంతో ఇలా పోలీసుల ముందుకు వచ్చాడు. మొత్తానికి ఎన్ కౌంటర్ భయంతో అయినా నేరస్థులు ఆగిపోతే సమాజం బాగుపడుతుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR