Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

ఈ రోజుల్లో అనేక పనులు ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. 

  • Sep 23, 2020, 18:21 PM IST


ఈ రోజుల్లో అనేక పనులు ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. వేగం, టైమ్ సేవ్ అవడంతో మమలో చాలా మంది ఆన్ లైన్ బ్యాంకింగ్ ను ఎంచుకుంటున్నాం. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసే సమయంలో మీరు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

1 /5

మీరు ఆన్ లైన్ బ్యాంకింగ్ లో సేఫ్ అండ్ సెక్యూర్ లావాదేవీలు నిర్వహించాలి అంటే అది సెక్యూర్డ్ వెబ్ సైట్ అవునో కాదో చెయండి ( అది  https: // తో స్టార్ట్ అవుతుంది. గుర్తు తెలియని వైఫైలను వాడి బ్యాంకింగ్ లేడా ఆన్ లైన్ షాపింగ్ చేయంకండి.

2 /5

మీ బ్యాంకు వివరాలను మొబైల్ లో, ఈమెయిల్స్ లో లేదా పర్సులో దాచడం మంచిది కాదు అని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూచించింది. వెరిఫైడ్, సెక్యూర్డ్, నమ్మదగ వెబ్ సైట్స్ మాత్రమే వాడండి.

3 /5

మీ బ్యాంకకు సంబంధించిన వివరాలు చోరి అయినా.. లేదా పిన్, ఓటీపి, వంటి వివరాల విషయంలో ఏవైనా సందేహాస్పద విషయాలు జరిగినా బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేసి సదరు ఆ లావాదేవీలను బ్లాక్ చేయించండి.

4 /5

మీకు ఫోన్  లేదా మసేజ్, ఈమెయిల్ చేసి ఎవరైనా మీ బ్యాంకు వివరాలు, ఇతర గోప్యమైన సమాచారం కోరితే ఇవ్వకండి. వెంటనే కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడండి.

5 /5

మీకు గుర్తు తెలియని ప్రాసెసర్ నుంచి డౌన్ లోడ్ చేయడం లేదా ఏవైనా సమాచారం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. వాటి వల్ల మీకు చాలా నష్టం కలిగే అవకాశం ఉంది.