Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి

డ్రైవింగ్ ( Driving ) అంటే చాలా ఫోకస్ గా చేయాల్సిన పని. దాని కోసం మంచి విశ్రాంతి కూడా అవసరం.

Last Updated : Sep 20, 2020, 02:39 PM IST
    • డ్రైవింగ్ అంటే చాలా ఫోకస్ గా చేయాల్సిన పని. దాని కోసం మంచి విశ్రాంతి కూడా అవసరం.
    • ఎందుకంటే డ్రైవింగ్ చేసే సమయంలో నిద్ర వస్తే డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది.
    • క్షణం నిద్ర వల్ల పెను ప్రమాదమే జరగవచచ్చు.
    • ఈ రోజుల్లో అనేక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవింగ్ సమయంలో నిద్ర ముంచుకురావడమే.
    • అందుకే డ్రైవింగ్ చేసే సమయంలో మీకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తే కాసేపు బండిని సేఫ్ ప్లేస్ లో నిలిపి రెస్ట్ తీసుకోవడం మంచిది.
Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి

డ్రైవింగ్ ( Driving ) అంటే చాలా ఫోకస్ గా చేయాల్సిన పని. దాని కోసం మంచి విశ్రాంతి కూడా అవసరం. ఎందుకంటే డ్రైవింగ్ చేసే సమయంలో నిద్ర వస్తే డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. క్షణం నిద్ర వల్ల పెను ప్రమాదమే జరగవచచ్చు. ఈ రోజుల్లో అనేక రోడ్డు ప్రమాదాలకు ( Accidents ) ప్రధాన కారణం డ్రైవింగ్ సమయంలో నిద్ర ముంచుకురావడమే. అందుకే డ్రైవింగ్ చేసే సమయంలో మీకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తే కాసేపు బండిని సేఫ్ ప్లేస్ లో నిలిపి రెస్ట్ తీసుకోవడం మంచిది. 

ALSO READ| How To Wear Mask: మాస్క్‌లు ధరించే సరైన విధానం మీకు తెలుసా?

బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది
నిజానికి మీకు డ్రైవింగ్ లో నిద్ర వస్తే అప్పుడు మీ నిద్ర నాలుగో స్టేజ్ లో ఉన్నట్టు లెక్క. మన శరీరానికి రాత్రి పడుకోవడం, పొద్దంతా యాక్టివ్ గా ఉండటం అలవాటు. అందుకే రాత్రి సమయంలో నిద్రను పక్కన పెట్టి డ్రైవింగ్ ( Driving at Night ) చేయడం వల్ల మన శరీర బయోలాజికల్ క్లాక్ ( Biological Clock ) డిస్టర్బ్ అవుతుంది.  దాంతో పాటు రాత్రి సమయంలో కంటికి ఎదురుగా వచ్చే వాహనాల ఫ్లాష్ లైట్ల వల్ల కళ్లు మరింతగా అలసిపోతాయి. 

రోడ్డు మలుపులు, గోతులు, రోడ్డు దాటే మనుషులు, మూగజీవాలు పెద్ద సమస్యగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో  సాధారణ మనిషి కంటికి దూరంగా ఉండే విషయాలు అంతగా కనిపించవు. దగ్గరికి వచ్చే వరకు కొంత ఆలస్యం జరగవచ్చు. అందుకే పగటిపూట ప్రయాణం ఉత్తమం. అయితే కొందరికి మాత్రం రాత్రి పూట ప్రయాణం తప్పదు. అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి భారీ ప్రమాదల వరకు తప్పించుకోవచ్చు.

ALSO READ| Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?

రాత్రి ప్రయాణం చేసేవారికి చిట్కాలు

1. వేగం ( Speed of Driving ):
రాత్రి సమయంలో రోడ్డు బాగా ఖాళీగా ఉంటుంది. దీంతో బండిని వేగంగా నడపాలి అనే కోరిక కలుగుతుంది. కానీ వేగం కంటే సేఫ్టీ ముఖ్యం. యావరేజ్ స్పీడ్ లో బండినడపడం చాలా మంచిది.

2. లైట్లు చూసే విధానం:
 చాలా మంది డ్రైవర్లు రాత్రి సమయంలో నిద్ర రాకుండా ఉండేందుకు ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్స్ చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల కంటిచూపు నెమ్మదించే అవకాశం ఉంది.

3. ఎక్కువగా తినడం ( Over Eating ): 
ఖాళీ కడుపుతో బండినడపరాదు. అలాగే అవసరం ఉన్న దానికన్నా ఎక్కువగా తిని బండి నడపరాదు. తిన్నాక కాస్త బ్రేక్ తీసుకుని డ్రైవింగ్ చేయగలను అని అనిపిస్తేనే డ్రైవ్ చేయండి.

4. స్మోకింగ్: 
నైట్ డ్రైవింగ్ సమయంలో ఆల్కహాల్  లేదాయ ఇతర మత్తు పదార్ధాలు సేవించడం మంచిది కాదు. దాంతో పాటు చాలా మంది నిద్రరాకుండా ఉండేందుకు నోట్టో జర్దా, పాన్ , గుట్కా  వేసుకుంటారు. ఇలాంటి వాటికి అలవాటు పడకండి. దాంతో పాటు జలుబు, దగ్గు మందులు కూడా నిద్రను కలిగించగలవు.

ALSO READ| Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం

మీకు నిద్ర వస్తోంది అనిపిస్తే . బండిని సురక్షితమైన ప్రాంతంలో నిలిపి.. అరగంట కునుకు తీయండి. తరువాత ముఖం కడిగి ప్రయాణం మొదలుపెట్టవచ్చు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News