LPG Price Hiked: సామాన్యుల నెత్తిన గ్యాస్ ‘బండ’
నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
Lpg price hiked: న్యూఢిల్లీ: నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. రాయితీ గ్యాస్ సిలిండర్ ( LPG GAS ) ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు సంస్థలు (LPG companies) నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో సామాన్యులపై ఒక్కో సిలిండర్ (Lpg price hiked) పై రూ.50 భారం పడనుంది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈ మేరకు కంపెనీలు గురువారం ప్రకటించాయి.
తాజాగా గ్యాస్ సిలిండర్‌పై పెరిగిన ధరలతో.. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో రాయితీ సిలిండర్ ధర రూ.594 నుంచి రూ.644కు పెరిగింది. దీంతోపాటు హైదరాబాద్ ( Hyderabad ) లో ఇప్పటివరకు రూ.646.50గా ఉన్న సిలిండర్ ధర.. తాజాగా పెరిగిన ధరలతో రూ.696.5కు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎల్పీజీ ధరలు దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న వంట గ్యాస్ ధరలు.. ఒకేసారి పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. Also read: How To Book LPG Cylinder: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 మార్గాలు ఇవే!
అయితే గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై రాయితీ కల్పిస్తోన్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఏడాదికి 12 సిలిండర్ల వరకు రాయితీతో కొనుగోలు చేసుకోవచ్చు. అంతకంటే.. ఇంకా ఎక్కువ సిలిండర్లు కావాలనుకునే వారు మార్కెట్ ధర చెల్లించి కొనక్కోవాల్సి ఉంటుంది.
Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe