పేరుకు ముందు గోత్రం పెట్టుకోండి అంటున్న కేంద్ర సహాయ మంత్రి
పేరుకు ముందు గోత్రం పెట్టుకోండి : కేంద్ర సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్
కేంద్ర కేబినెట్లో కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తన పేరుకు ముందు శాండిల్య అనే తన గోత్రాన్ని చేర్చుకున్నట్టు తెలిపారు. ఇకపై తనను శాండిల్య గిరిరాజ్ సింగ్ అనే పిలిపించుకోనున్నట్టు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా హిందు సనాతన ధర్మాన్ని సంరక్షించేందుకు హిందువులు అందరూ తనలాగే వారివారి పేర్లకు ముందు వారి గోత్రాలు చేర్చుకోవాల్సిందిగా శాండిల్య గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం ట్విటర్ ద్వారా కేంద్ర సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ హిందువులకు ఈ విజ్ఞప్తి చేశారు.