Curfew in Goa, rules and regulations to know: పనాజి: గోవాలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులకు చెక్ పెట్టేందుకు గోవా సర్కార్ మరో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలతో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదని స్పష్టంచేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్.. గోవాలో మే 9వ తేదీ ఆదివారం నుండి 15 రోజుల పాటు పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల కొనుగోలు కోసం కిరాణ దుకాణాలు తెరిచే ఉంటాయి. మెడికల్ షాప్స్, మెడికల్ సర్వీసెస్‌కి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను జనం భేఖాతరు చేస్తూ అనవసరంగా రోడ్లపైకి వస్తున్నందు వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రమోద్ సావంత్ మీడియాకు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇతర రాష్ట్రాల నుంచి గోవా వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా కొవిడ్-19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ (COVID-19 negative test report or vaccination certificate) చూపించాల్సి ఉంటుందని, లేదంటే రాష్ట్రంలోకి అనుమతించేది లేదని సీఎం ప్రమోద్ సావంత్ స్పష్టంచేశారు. వేడుకల వల్లే కరోనా వేగంగా వ్యాపిస్తోందని, కర్ఫ్యూ అమలులో ఉన్నంత కాలం పెళ్లి శుభకార్యాలు (Wedding in lockdown) సహా ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్‌కి అనుమతి ఇచ్చేది లేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa CM Pramod Sawant) అన్నారు. 


Also read : Lockdown updates from Telangana: తెలంగాణలో lockdown విధించడం లేదు: సీఎం కేసీఆర్


గోవాలో గురువారం ఒక్క రోజే మొత్తం 3,869 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మరో 58 మంది కరోనాతో మృతి చెందారు. గోవాలో ఒక్క రోజులో ఈ స్థాయిలో కరోనా కేసులు బయటపడటం ఇదే తొలిసారి. గోవాలో కేసులు పెరగడంలో గోవా పర్యాటకం (Goa tourism) కూడా ఓ కారణంగా తెలుస్తోంది.


Also read : Telanganaలో పెరుగుతున్న COVID-19 రికవరీ కేసులు, తాజాగా 46 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook