Goa Prohibits Tourists On Clicking Selfies: మీరు గోవాను వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అక్కడ బీచ్‌లో బీర్ తాగుతూ.. విదేశీయులతో సెల్ఫీలు దిగేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే మీ ఆలోచనలకు బ్రేక్ వేయండి. ఇక నుంచి గోవాలో కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. గోవాలో పర్యాటకుల గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇక నుంచి గోవాలో బహిరంగంగా మద్యం సేవించినా.. పబ్లిక్ ప్లేస్‌లో  ఆహారం వండినా రూ.50 వేల వరకు చెల్లించాల్సిందే. బీచ్‌లో మద్యం సేవించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా పర్యాటకుల అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ముఖ్యంగా పర్యాటకులు ఎండలో పడుకున్నప్పుడు లేదా సముద్రంలో సరదాగా గడుతుపుతున్నప్పుడు వారి గోప్యతకు భంగం కలుగుతోందని పేర్కొంది. అంతేకాకుండా అధిక ఛార్జీలను నివారించడానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పర్యాటకులు టాక్సీ మీటర్‌ను చూసి ఛార్జీలు చెల్లించాలని సూచించారు. పర్యాటకుల గోప్యతను కాపాడటం.. వారి భద్రతకు కల్పించడం, వారు మోసపోకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 


పర్యాటకులు రాళ్లు, ప్రమాదకరమైన ప్రదేశాలపై సెల్ఫీలు తీసుకోవద్దని అధికారులు సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. గోవాలోని చారిత్రక కట్టడాలను పాడుచేయవద్దని గోవా అధికారులు పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. గోవాకు వచ్చే పర్యాటకులు కూడా టూరిస్ట్ డిపార్ట్‌మెంట్‌లో రిజిస్టర్ అయిన హోటళ్లలోనే బస చేయాలని కోరారు. చాలామంది పర్యాటకులు రిజిస్టర్ కానీ హోటళ్లలో బస చేస్తున్నారని.. దీని వల్ల వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. 


బహిరంగ ప్రదేశాల్లో ఆహారాన్ని వండడం నిషేధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వంట వస్తువులను సీజ్ చేయడంతోపాటు రూ.50 వేల వరకు జరిమానా విధించనుంది. అంతేకాకుండా బీచ్‌లు మొదలైన బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధించింది. రెస్టారెంట్‌లు, హోటళ్లు మొదలైన లైసెన్స్ పొందిన ప్రదేశాల్లో మాత్రమే మద్యం సేవించాలని పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది హాలిడే ట్రిప్‌ కోసం గోవాకు వస్తుంటారు. ప్రైవేట్ వాహనాలు, అద్దె క్యాబ్‌లు, మోటర్‌బైక్‌లను అద్దెకు తీసుకోవద్దని.. రవాణాశాఖలో రిజిస్టర్ చేసుకున్న వాహనాలనే తీసుకోవాలని గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ సూచించింది. 


Also Read: Minister Roja: లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లోకే.. తారకరత్న త్వరగా కోలుకోవాలి: మంత్రి రోజా  


Also Read: Go First: 55 మంది ప్రయాణికులను విడిచివెళ్లిన గోఫస్ట్‌పై భారీ జరిమానా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి