Go First: 55 మంది ప్రయాణికులను విడిచివెళ్లిన గోఫస్ట్‌పై భారీ జరిమానా

DGCA Imposes Rs 10 Lakh Fine On Go First: గోఫస్ట్ ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు తీసుకుంది. 55 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులో వదిలేసి వెళ్లిపోయిన ఘటనపై సీరియస్ అయింది. ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఎయిర్‌లైన్స్‌ విఫలమైందని స్పష్టంచేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 01:45 PM IST
Go First: 55 మంది ప్రయాణికులను విడిచివెళ్లిన గోఫస్ట్‌పై భారీ జరిమానా

DGCA Imposes Rs 10 Lakh Fine On Go First: ఇటీవలె 55 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలేసి వెళ్లిన గో ఫస్ట్ కంపెనీకి డీజీసీఏ కంపెనీ భారీ జరిమానా విధించింది. గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌పై రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటన తర్వాత ఏవియేషన్ రెగ్యులేటర్ ఎయిర్‌లైన్స్‌కి షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. జనవరి 9న బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించకుండానే గోఫస్ట్ విమానం టేకాఫ్ అయింది. దీంతో విమానయాన సంస్థకు డీజీసీఏ జరిమానా విధించింది. 

ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. టెర్మినల్‌ కోఆర్డినేటర్‌, కమర్షియల్‌ సిబ్బంది, బోర్డింగ్‌ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఎయిర్‌లైన్స్‌ విఫలమైందని డీజీసీఏ స్పష్టం చేసింది. రెగ్యులేటర్ ఇతర లోపాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించింది. దీంతో రూ.10 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

కాగా.. ఈ ఘటనపై గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు కూడా చెప్పింది. విమానం టేకాఫ్‌కు ముందు ప్రయాణికులను తనిఖీ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఎయిర్‌లైన్ కంపెనీ ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఉద్యోగులందరినీ రోస్టర్ నుంచి తొలగించింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి G8-116 విమానంలో బయలుదేరే ముందు ప్రయారణికులను పరీక్షించేటప్పుడు నిర్లక్ష్యం కారణంగా తలెత్తిన పరిస్థితికి తాము క్షమాపణలు కోరుతున్నామని ప్రకటన రిలీజ్ చేసింది. 

అంతేకాకుండా విమానాశ్రయంలో మిగిలిపోయిన 55 మంది ప్రయాణికులు ఏడాదిలోపు దేశంలో ఎక్కడికైనా ఒకసారి ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. వీరందరూ బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా.. ప్రయాణికులను తీసుకోకుండానే విమానం వెళ్లిపోయింది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులు చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నారు. అయినా విమానం వీరికి ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన గో ఫస్ట్ కంపెనీ.. 12 నెలల్లో ఈ ప్రయాణికులు దేశంలోని ఏ నగరానికైనా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.  

Also Read: 7th Pay Commission: కేంద్రం ఈ మూడు ప్రకటనలు చేస్తే ఉద్యోగులకు పండగే.. బడ్జెట్‌పైనే ఆశలన్నీ..  

Also Read: IND Vs NZ: శుభ్‌మన్ గిల్ Vs పృథ్వీ షా.. హార్ధిక్ పాండ్యాను ఆడుకుంటున్న నెటిజన్లు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News