Karnataka bans food colouring agent: పీచు మిఠాయి, గోబీ మంచూరియాలో ఫుడ్ కలర్స్‌ని వినియోగించడంపై కర్కాటక సర్కార్ నిషేధం విధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. 'పీచు మిఠాయి, గోబీ మంచూరియాలో కృత్రిమ రంగులు కలపడంవల్ల క్యాన్సర్‌తో సహా పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యం కంటే మాకు ఏది ముఖ్యం కాదు. అందుకే ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్‌ కలపడాన్ని నిషేధం విధిస్తున్నామని' మంత్రి పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''హోటళ్లు, రోడ్‌సైడ్ షాపులుతోపాటు మరికొన్ని చోట్ల నుంచి శాంపిల్స్ సేకరించాం. 171 గోబి మంచూరియా శాంపిల్స్ సేకరించి పరీక్షించగా అందులో 64 మాత్రమే ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయని.. 106 నమూనాల్లో ప్రమాదకర రసాయనాలు కనిపించాయి. ఇక 25 కాటన్ క్యాండీ శాంపిల్స్ సేకరించి పరీక్షించగా...15 శాంపిల్స్ హానికరంగా ఉన్నాయి. ఈ శాంపిల్స్‌లో Tartrazine, Carmoisine, Sunset Yellow మరియు Rhodamine-1B వంటి కొన్ని కృత్రిమ రంగులు ఈ నమూనాల్లో గుర్తించినట్లు'' మంత్రి తెలిపారు. 


ఈ సందర్భంగా గోబీ మంచూరియన్ మరియు కాటన్ మిఠాయిలలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ  రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో గోవాలోని మపుసా మునిసిపల్ కౌన్సిల్ తమ ప్రాంతంలో గోబీ మంచూరియన్‌ను నిషేధించింది, పీచు మిఠాయిలో కెమికల్స్ ఎక్కువగా కలుపుతున్నారనే కారణంతో తమిళనాడుతో పాటు పుదుచ్చేరి ఇప్పటికే నిషేధం విధించాయి. 


Also Read: Free LPG Cylinder: హోలీకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. ఎక్కడంటే?


Also Read: Employment News: కేవలం రూ.25 చెల్లిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి