Free LPG Cylinder: హోలీకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. ఎక్కడంటే?

Holi 2024: హోలీ పండుగ సందర్భంగా కోట్లాది మందికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను అందించనుంది సర్కార్. దీని కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించవలసి ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2024, 12:02 PM IST
Free LPG Cylinder: హోలీకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. ఎక్కడంటే?

Free LPG Cylinder in UP: రంగుల హోలీ పండుగ రాబోతోంది. ఈ సందర్భంగా కోట్లాది మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ ను అందించనుంది సర్కార్. అవును, మీరు సరిగ్గానే విన్నారు. మీరు ఉత్తరప్రదేశ్ చెందిన వారైతే హోలీ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనుంది. దీని కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించవలసి ఉంటుంది.

ఈ పథకాన్ని గతేడాది నవంబరులోనే యోగి ప్రభుత్వం ప్రారంభించింది. దీపావళి సందర్భంగా రాష్ట్రంలో అర్హులైన 1.75 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసింది. ఇప్పుడు హోలీకి కూడా ఆ కానుకను అందించనుంది. దీపావళి మరియు హోలీ సందర్భంగా - సంవత్సరానికి రెండుసార్లు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలని యోగి సర్కార్ యోచిస్తోంది. దీని ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,312 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఉజ్వల పథకం అంటే ఏమిటి?

2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 9 కోట్ల మందికి పైగా ఉచిత ఎల్‌పిజి కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలో ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ ఇస్తుంది. గతంలో ఈ సబ్సిడీ రూ.200 ఉండగా, గతేడాది అదనంగా రూ.100 పెంచారు. ఏడాదిలో 12 గ్యాస్ సిలిండర్లకు ఈ సబ్సిడీని పొందవచ్చు. రాబోయే మూడేళ్లలో మోదీ సర్కారు 75 లక్షల ఉజ్వల కనెక్షన్‌లను అందించాలని యోచిస్తోంది. ఇది పూర్తయితే లబ్దిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరుగుతుంది. 

Also Read: LPG Gas Cylinder: ప్రధాని మోడీ  ఉమెన్స్ డే బంపర్ ఆఫర్.. ఇక రూ.500 కే గ్యాస్ సిలిండర్.. 

Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News