Godavari Floods: గోదావరికి పోటెత్తుతున్న వరద నీరు, రేపు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద నీరు పెరుగుతుండటంతో నీటి ఉధృతి అధికమౌతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ముప్పు వెంటాడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Godavari Floods: గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం వద్ద రేపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయవచ్చని అంచనా.
గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు గోదావరి జన్మస్థలమైన మహారాష్ట్రాలో సైతం భారీ వర్షాలుండటంతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలున్నాయనే ఐఎండీ హెచ్చరికల నేపధ్యంలో గోదావరి నీటిమట్టం మరింత పెరగనుందని తెలుస్తోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 41.4 అడుగులు చేరుకుంది. అటు ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ గేట్లు ఎత్తివేసి 8.41 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. రేపటి వరకూ ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పెరగవచ్చని అంచనా. రేపటికి 10 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
కేంద్ర జలసంఘం ప్రకారం రేపటి వరకూ వరద ఉధృతి క్రమంగా పెరగవచ్చని అంచనా. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప నది ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రాణహిత నది పొంగిపొర్లుతోంది. అటు అదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పెన్ గంగ సైతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత ఐదారు రోజుల్నించి కురుస్తున్న వర్షాలతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఇక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. గత 24 గంటల్లోనే 4.8 టీఎంసీల నీరు వచ్చిచేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1078 అడుగులకు చేరుకుంది. ఇక నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 41 టీఎంసీల నీరుంది.
Also read: Heavy Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook