CBI Gold Case: కంచే చేను మేస్తే సామెత సరిపోతుందో లేదో తెలియదు కానీ..అలాంటి వ్యవహారమే చోటు చేసుకుంది. అక్రమార్కుల భరతం పట్టాల్సిన సీబీఐ..బోనెక్కుతోంది. సీబీఐ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఏకంగా 103 కిలోల బంగారం మాయమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తమిళనాడు హైకోర్టు ( Tamil nadu High cout ) వ్యాఖ్యలతో సీబీఐ ( CBI ) నిర్వాకం లేదా నేరం బయటపడింది. సీబీఐ సేఫ్టీ లాకర్లో ఉండాల్సిన బంగారం మాయమైంది. అది కూడా 103 కిలోల బంగారం. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీసుల్ని ఆదేశించింది. ఇప్పుడీ అంశమే సీబీఐకు టెన్షన్ తెప్పిస్తోంది. 


అసలేం జరిగిందంటే..చెన్నై( Chennai ) లోని మిన‌ర‌ల్స్ అండ్ మెట‌ల్స్ ట్రేడింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎమ్ఎమ్‌టిసి) అధికారులు.. బంగారం, వెండి దిగుమ‌తుల కంపెనీ సురానా కార్పొరేష‌న్ లిమిటెడ్‌కు సాయం చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై 2012లో ఓ కేసు నమోదు చేసి..బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బంగారు క‌డ్డీలు, ఆభ‌ర‌ణాల రూపంలో ఉన్న 4 వందల కిలోల బంగారాన్ని చెన్నైలోని సురానా ఆఫీస్ నుంచి స్వాధీనం చేసుకుని..లాకర్లలో పెట్టి సీజ్ చేసింది సీబీఐ. తరువాత లాకర్ తాళాన్ని చెన్నైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు. ఇందులోంచి 103 కిలోల బంగారం మాయమైంది. Also read: Narendra Modi: శరద్ పవార్‌, రజనీకాంత్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు


2013 సెప్టెంబర్ నెలలో సురానా కంపెనీ ( Surana company ) పై మరో కేసు నమోదైంది. అయితే 2012లో సీజ్ చేసిన బంగారం కేసు నుంచి ఫారిన్ ట్రేడ్ పాలసీను ఉల్లంఘించిన కేసుకు బదిలీ చేయాలని సీబీఐ అభ్యర్ధించగా..కోర్టు అంగీకరించింది. అప్పటికే బంగారం సీబీఐ కస్డడీలో ఉండటంతో దాన్ని భౌతికంగా ముట్టుకోకుండానే కేసుల పత్రాల్లో మార్పులు చేశారు. ఇక 2015లో కేసులో ఆధారాలు లభించకపోవడంతో కేసు క్లోజ్ అయింది. స్వాధీనమైన బంగారాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.


మరోవైపు 1160 కోట్ల రుణ బకాయిల కోసం ఎస్బీఐ (SBI )సురానా కంపెనీపై చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సీబీఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కోరుతూ సీబీఐ కోర్టును కోరింది. చివరికి ఈ వ్యవహారంలో నేషనల్ కంపెనీ ల్యా ట్రిబ్యునల్ ( National law tribunal ) ..సీబీఐ కస్డడీలోని బంగారాన్ని సురానా బాకీ పడ్డ బ్యాంకులకు చెల్లించాలని ఆదేశించింది కోర్టు. ఈ నేపధ్యంలో సీబీఐ లాకర్‌ను తెరవగా..103 కిలోల బంగారం మాయమైనట్టు తెలిసింది. 


ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై విచారణ జరపాలంటూ మద్రాస్ హైకోర్టు ( Madras High court ) తమిళనాడు పోలీసుల్ని ఆదేశించింది. స్థానిక పోలీసులతో విచారణైతే..సీబీఐ ప్రతిష్ట పోతుందని..సీబీ సీఐడీకు అప్పగించాలని సీబీఐ కోరింది. సీబీఐకు ఇది అగ్నిపరీక్ష కావచ్చని..చేతులు శుభ్రంగా ఉంటే సీతలా బయటకు రావచ్చని..లేకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని  కోర్టు తెలిపింది. అంటే ఇప్పుడు సీబీఐను సాధారణ పోలీసులు విచారిస్తారన్నమాట. పోలీసుల బోనులో సీబీఐ ఎక్కనుందన్న మాట. Also read: Farmer protests: ఉద్యమంలోకి అలాంటి వారు ప్రవేశిస్తే అరెస్ట్ చేయండి