Narendra Modi: శరద్ పవార్‌, రజనీకాంత్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Last Updated : Dec 12, 2020, 12:10 PM IST
Narendra Modi: శరద్ పవార్‌, రజనీకాంత్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

PM Narendra Modi greets Sharad Pawar and Rajinikanth: న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు కూడా ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. శనివారం వారిద్దరి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధాని వేర్వేరుగా ట్వీట్లు చేశారు.

మరాఠా యోధుడు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ( NCP ) అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌ పవార్‌ ( Sharad Pawar ) ఈ రోజుతో 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శరద్‌ పవార్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. Also read: UPA చైర్మన్‌గా శరద్ పవార్‌ను నియమిస్తే మద్దతిస్తాం: శివసేన

నేటితో 70వ వసంతంలోకి ప్రవేశించిన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ( Rajinikanth ) కు కూడా ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి.. జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. ఈ రోజు పవార్, రజనీ కాంత్ పుట్టినరోజును పురస్కరించుకొని వారిద్దరికి అభిమానులు సోషల్ మీడియా వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Also read; Rajinikanth: జనవరిలో తలైవా రాజకీయ అరంగ్రేటం

Also read: Tamannaah: లిప్‌లాక్.. ఆ హీరోతో అయితే ఓకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News