తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. వెండి పైపైకి
బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలల్లో ధరలు తగ్గగా, దేశ రాజధాని ఢిల్లీలో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలల్లో ధరలు తగ్గగా, దేశ రాజధాని ఢిల్లీలో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా బంగారం కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.140 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,010కి క్షీణించింది. నిన్న ఆల్ టైమ్ రికార్డు ధర రూ.49,150 నమోదు కావడం తెలిసిందే. అదే విధంగా 22 క్యారెట్లపై రూ.210 మేర తగ్గడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.45,230కి పతనమైంది. ఎగసిన కెరటం నటి ఐశ్వర్య రాజేష్.. కంటతడి పెట్టించే విషాదాలెన్నో..
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ వరుసగా రెండో రోజులు ర్యాలీ చేసిన బంగార ధరలు నేడు యథాతథంగా ఉన్నాయి. నిన్న మార్కెట్‌లో రూ.110 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,810కి దిగొచ్చింది. నేడు అదే ధరలో కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,000 వద్ద ట్రేడ్ అవుతోంది. బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి
బులియన్ మార్కెట్‌లో నిన్న రూ.360 తగ్గిన వెండి ధర నేడు రూ.700 మేర భారీగా పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.48,700 నమోదు చేసింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..