దిల్లీ : గత కొద్ది రోజులుగా నిరంతరంగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్‌ పడింది. గురువారం బంగారం ధర తగ్గి రూ.  41 వేల మార్క్‌ దిగువకు చేరింది. నేడు రూ.766 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.40,634కి చేరింది. రూపాయి విలువ బలపడటంతో పాటు అంతర్జాతీయ పరిణామాల కారణంగా పసిడి ధర తగ్గినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. 


మరొక వైపు వెండి ధర భారీగానే తగ్గింది. రూ.1,148 తగ్గడంతో కిలో వెండి రూ.47,932 చేరింది. గత సీజన్ రూ.49,080గా ఉంది. అటు అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు తగ్గాయి. ఔన్సు బంగారం ధర 1,546 డాలర్లుగా ఉండగా.. వెండి 17.93 డాలర్లు పలికింది. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..