మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయ్
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. మూడో రోజు కూడా బంగారం ధర వరసగా పెరిగింది.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. మూడో రోజు కూడా బంగారం ధర వరసగా పెరిగింది. ముఖ్యంగా విదేశీ మార్కెట్ ప్రభావం పడడంతో పాటు స్థానికంగా డిమాండ్ కూడా బాగా వెల్లువెత్తడంతో పాటు.. వివాహాల సీజన్ కావడంతో బంగారం ధర బాగా పెరిగింది. ఈ క్రమంలో బంగారం కొనేవారి సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా అక్షయ తృతీయ ప్రభావం కూడా స్థానిక బంగారం మార్కెట్ పై పడింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం పది గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.32,630కి చేరినట్లు సమాచారం. అలాగే చెన్నై మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.30050 ఉండగా, అదే ధర ముంబయి (రూ.30580), ఢిల్లీ (రూ.30500), కోల్‌కతా (రూ.30770)గా నమోదైంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరలు మాత్రం మళ్లీ భగ్గుమన్నాయి. చెన్నై మార్కెట్‌లో పది గ్రాముల ధర రూ.32139 ఉండగా, ఢిల్లీ (రూ.32705), కోల్‌కతా (రూ.32909), బెంగళూరు (రూ.31390)లో ధరలు ఈ విధంగా నమోదయ్యాయి.