AAI Apprentice Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మెుత్తం 85 అప్రెంటిస్ (Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏఏఐ అధికారిక వెబ్ సైట్ aai.aero ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ షురూ అయింది. దరఖాస్తు చేసుకోవడానికి చివర తేదీ జనవరి 15, 2024. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖాళీల వివరాలు:
సివిల్ ఇంజినీరింగ్ : 15 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ : 21 పోస్టులు
ఎలక్ట్రానిక్ / ఐటీ/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ : 9 పోస్టులు
మెకానికల్ ఇంజినీరింగ్ : 3 పోస్టులు
ఫిట్టర్ : 2 పోస్టులు
మెకానిక్ : 5 పోస్టులు
డ్రాఫ్ట్స్ మెన్ : 4 పోస్టులు
ఎలక్ట్రీషియన్ : 19 పోస్టులు


ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా. అభ్యర్థులు పైన పేర్కొన్న విభాగాల్లో ఏదో ఒక దాంట్లో ఏఐసీటీఈ, జీఓఐ గుర్తింపు పొందిన ఫుల్ టైమ్ (రెగ్యులర్ ) నాలుగేళ్ల డిగ్రీ లేదా మూడేళ్ల (రెగ్యులర్ ) ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి. ఏఐసీటీఈ, జీఓఐ గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఐటీఐ/ఎన్సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అదే విధంగా అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. 


సెలక్షన్: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ను  ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. దీంతో మెడికల్ సర్టిఫికేట్ ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. పూర్తి వివరాల కోసం ఏఏఐ అధికారిక వెబ్ సైట్ ను చూడండి. 


జీతం
గ్రాడ్యుయేట్ (డిగ్రీ) అప్రెంటీస్: నెలకు రూ. 15,000
టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటీస్: రూ. నెలకు రూ.12,000
ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ): రూ. నెలకు రూ.9,000


Also read: Jammu Kashmir Pics: భూతల స్వర్గం జమ్ము కశ్మీర్‌లో గడ్డకట్టిన దాల్ సరస్సు, పోటెత్తుతున్న పర్యాటకులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook