Long Weekend Dates: నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2 రోజుల వీకెండ్ వచ్చిన ప్రతిసారీ ఎక్కడికెళ్లాలో తెలియక అలానే ఇంట్లోనే ఉండిపోయేవారు 3-4 రోజుల వీకెండ్ కోసం నిరీక్షిస్తుంటారు. ఆ కోరిక నెరవేరనుంది. వచ్చే నెలలో ఏకంగా 5 రోజుల లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. ఒక్కరోజు సిక్ లీవ్ పెడితే చాలు ఐదు రోజులు వీకెండ్ ఎక్కడికైనా వెకేషన్ వెళ్లి రావచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా చాలామంది ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలున్నాయి. వారంలో శని, ఆదివారాలు సెలవులుటాయి. అందుకే పని ఒత్తిడి నుంచి ఆ రెండ్రోజులు కాస్త రిలాక్స్ అవుతుంటారు. ఈ క్రమంలో ఎప్పుడైనా ఒక్కోసారి వారానికి 3 రోజులు సెలవు వస్తే లాంగ్ వీకెండ్ వచ్చేసిందని ఆనందపడుతుంటారు. అలాంటిది ఈసారి బంపర్ ఆఫర్ తగనుంది. వచ్చే నెలలో అంటే ఆగస్టులో ఏకంగా 5 రోజుల లాంగ్ వీకెండ్ వస్తోంది. బీ రెడీ టు ఎంజాయ్ ది వీక్. హాయిగా కుటుంబంతో సహా ఎక్కడికైనా దూరంగా వెకేషన్ వెళ్లి రావచ్చు. అందులో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఐదు రోజులు ఏ కేరళలోనే ఎంజాయ్ చేసి రావచ్చు. అయితే మధ్యలో ఒక్కరోజు సిక్ లీవ్ పెట్టాల్సి వస్తుంది. ఈ లాంగ్ వీకెండ్ కధేంటో తెలుసుకుందాం


ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే గురువారం వచ్చింది. ఆగస్టు 16 శుక్రవారం ఒక్కరోజు సిక్ లీవ్ పెట్టగలిగితే ఆగస్టు 17, 18 తేదీలు శని, అదివారాల సెలవులున్నాయి. ఆగస్టు 19 సోమవారం రాఖీ పండుగ సెలవుంటుంది. అంటే శుక్రవారం ఆగస్టు 16న ఏదో ఒక లీవ్ పెడితే హాయిగా 5 రోజులు సెలవులు ఎంజాయ్ చేయవచ్చు. ఐదురోజులు కాబట్టి ఎక్కడికైనా దూర ప్రదేశానికి సైతం వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. 


మరెందుకు ఆలస్యం..ఇంకా 25 రోజులు సమయం మిగిలుంది. ఇప్పట్నించే ఆ ఒక్క లీవ్ ముందే అప్లై చేసి ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోండి.5 రోజుల లాంగ్ వీకెండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రాదు మరి. జస్ట్ ఎంజాయ్ ది లాంగ్ వీకెండ్.


Also read: Godavari Krishna Flood Water Levels: గోదావరి, కృష్ణా నదులకు పోటెత్తుతున్న వరద, వివిధ జలాశయాల్లో నీటిమట్టం వివరాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook