Old Pension Scheme Latest News Today: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఉద్యోగులుక పాత పెన్షన్ విధానమే అమలు చేస్తోంది. 2006 తరువాత నియామకమైన రాష్ట్రంలోని 13 వేలమంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానమే అమలు చేసేలా నోటిఫికేషన్ జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులపెన్షన్ విధానం వివాదాస్పదంగా మారింది. పాత పెన్షన్ విధానం తొలగించి కొత్త విధానం ప్రవేశపెట్టడంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తిరిగి పాత విధానాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఇందులో భాగంగానే మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు వారి సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు తాను వారికి హామీ ఇచ్చానని, ఆ హామీని ఇప్పుడు నెరవేర్చానని సోషల్ మీడియాలో స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 13 వేలమంది NPS ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. 


పాత పెన్షన్ విధానంలో ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ తరువాత పెన్షన్ లభిస్తుంటుంది. ఆ ఉద్యోగి గతంలో తీసుకున్న జీతంలో సగం పెన్షన్‌గా వస్తుంటుంది. అదే కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగి జీతంలో కొంతమొత్తం పెన్షన్ నిధికి జమ అవుతుంది. రిటైర్మెంట్ తరువాత ఒకేసారి తగిన మొత్తం చేతికి అందుతుంది. పాత పెన్షన్ విధానం 2003 డిసెంబర్ నుంచి ఉపసంహరించి కొత్త పెన్షన్ విధానాన్ని 2004 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. 


Read More: Mother Emotional Letter: కన్నా ప్రపంచంలోనే అత్యుత్తమ కొడుకివి నువ్వే రా.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి లేఖ


రాజస్తాన్ పాత ప్రభుత్వం అంటే గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత పెన్షన్ విధానాన్ని అవలంభించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తిరిగి కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్తగా చేరిన ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం వర్తిస్తుందని ఆదేశాలు జారీ చేశారు. 


Also read: Aadhaar Update: ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చడం అప్‌డేట్ చేయడం ఎలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook