DA Hike: ఇటీవలే కేంద్ర ప్రభుత్వం..ఉద్యోగులకు DA పెంచిన సంగతి తెలిసిందే. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే కోవలో ఉద్యోగులకు DA పెంచింది. మొదట యూపీ ప్రభుత్వం పెంచగా.. ఇప్పుడు ఒడిశా ప్రభుత్వం కూడా ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒరిస్సా రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇక నుండి ఎక్కువ జీతం, పెన్షన్ లభించనుంది. దీపావళికి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు DA పెంచింది. ఈ పండుగ సీజన్‌లో, ఉద్యోగులు పెరిగిన జీతం మరియు DA దీపావళికి ముందే పొందనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ANI ట్వీట్.. 
పెరిగిన DAల గురించి ANI తన ట్వీట్ ద్వారా తెలిపింది. ANI చేసిన ట్వీట్ ప్రకారం.. ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) 4% పెంచిందని.. డియర్‌నెస్ రిలీఫ్ (TI)ని 42% నుండి 46%కి పెంచిందని ANI ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పెరిగిన DA మరియు TI చెల్లింపు జూలై 1 నుండి అమలులోకి రానుందని తెలిపింది. 


4.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం.. 
ఒరిస్సా ప్రభుత్వం పెంచిన డియర్‌నెస్ అలవెన్స్ వల్ల 4.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. 3.5 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకు సంబంధించిన పెరిగిన DAను అక్టోబర్ నెల జీతంలో జత చేసి ఉద్యోగులకు అందజేయనున్నారు. 


Also Read: Sreeleela : ఫైనల్ గా బాలకృష్ణ సహాయంతో.. తనంటే ఏంటో రుజువు చేసుకున్న శ్రీలీల..



DA పెంచిన కేంద్ర ప్రభుత్వం 
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు DA 4 శాతం పెంచింది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 46 శాతం DA  లభించనుంది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఉండేది. 


సంవత్సరంలో 2 సార్లు పెరగనున్న DA


కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతున్నాయని మనకు తెలిసిందే! DA లో పెరుగుదల జనవరిలో జరగగా.. రెండో పెరుగుదల జులైలో జరుగుతుంది. దీని వలన దేశంలోని 52 లక్షల మంది ఉద్యోగులు, 60 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతున్నారు. 


Also Read: Minister KTR: కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..