Good News For Motorists: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ వ్యాలిడిటీ ముగిసిందా, అయితే మీకు గుడ్ న్యూస్ తెలుసా
Good News For Motorists: డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్, మరియు ఇతరత్రా పత్రాలు ఫిబ్రవరి 1, 2020 తరువాత వ్యాలిడిటీ ముగిసినట్లయితే వాటిని రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
Good News For Motorists: మీ డ్రైవింగ్ లైసెన్స్ (Driving License), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (Registration Certificate) వ్యాలిడిటీ ముగిసిపోయిందా.. వాహనదారులకు రోడ్లు, రహదారుల మంత్రిత్వశాఖ శుభవార్త అందించింది. వీటి వ్యాలిడిటీని గడువు ముగిసినా సెప్టెంబర్ 30, 2021 వరకు ఆ పత్రాలు, కార్డులను అనుమతిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.
డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్, మరియు ఇతరత్రా పత్రాలు ఫిబ్రవరి 1, 2020 తరువాత వ్యాలిడిటీ ముగిసినట్లయితే వాటిని రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కరోనా వ్యాప్తి, కోవిడ్19 నిబంధనలు, ఆంక్షల నేపథ్యంలో రోడ్లు, రహదారుల మంత్రిత్వశాఖ వాహనదారులకు ఊరట కలిగించింది. పాత పత్రాలు ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతాయని, అప్పటిలోగా వాటిని రెన్యువల్ చేసుకోవాలని వాహనదారులకు రవాణాశాఖ అధికారులు సూచించారు. ఏ పత్రాలైనా సరే వాహనదారులకు సెప్టెంబర్ 30 వరకు ఏ ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.
కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించాలని, వాహనదారులకు ఏ ఇబ్బంది కలగజేయకూడదని సూచించింది. కోవిడ్19 కష్టకాలంలో వాహనదారులకు ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నుంచి మార్చి 30, 2020, జూన్ 9, 2020, ఆగస్టు 24, 2020, డిసెంబర్ 27, 2020 మరియు మార్చి 26, 2021 తేదీలలో సైతం మోటారు వాహనాల చట్టం 1988, మరియు కేంద్ర మోటారు వాహనాల నియమాలు 1989 కింద పలుమార్లు మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
Also Read: EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్ నగదు సాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook