ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో దీపావళి శుభవార్త అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ చెల్లించిన ఈపీఎఫ్ వడ్డీని దీపావళి నాటికి పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఓ ప్రకటనలో తెలిపింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని అందించనున్నట్లు లాక్‌డౌన్ సమయంలోనే ఈపీఎఫ్‌వో ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ వడ్డీ డబ్బును రెండు విడతలుగా పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలోకి జమ చేయనున్నట్లు కొన్ని రోజుల కిందట మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా అందులో మార్పు చేసి ఒకేసారి మొత్తం వడ్డీ నగదును ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించనున్నట్లు స్పష్టం చేసింది. 



 


తొలుత తీసుకున్న నిర్ణయం ప్రకారం దీపావళి సమయానికి తొలి విడత వడ్డీ నగదు ఖాతాదారుల అకౌంట్లలోకి జమ కానుంది. డిసెంబర్ నెలలో మిగతా మొత్తం జమ చేస్తామని ఇటీవల ఈపీఎఫ్‌వో పేర్కొంది. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని ఒకే దఫాలో మొత్తం 8.5 శాతం వడ్డీనీ ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలోకి జమచేయనున్నట్లు తెలిపింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe