శుభవార్త.. మీ PF రెట్టింపు అవుతుంది!

సాధారణంగా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకునే (Double PF) అవకాశం ఉంది.

Last Updated : Apr 20, 2020, 11:55 AM IST
శుభవార్త.. మీ PF రెట్టింపు అవుతుంది!

మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే ఇది మీకు కచ్చితంగా శుభవార్త. సాధారణంగా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది. కంపెనీని రిక్వెస్ట్ చేస్తే మీ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకోని ప్రయోజనాలు పొందండి. ట్యాక్స్ లాంటి విషయాలతో పాటు దీర్ఘకాలిక సేవింగ్స్ కింద పీఎఫ్ ఖాతాను వినియోగించుకోవచ్చు.  కరోనా ఎఫెక్ట్: మే 3 వరకు జీతాల్లేవ్

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ అకౌంట్‌పై గతంలో 8.5 శాతం వడ్డీ రేటు వచ్చేది. ప్రభుత్వ అందించే వాటిలో వడ్డీ రేటు లభిస్తున్న ఏకైక స్కీమ్ ఇదే. ఇటీవల వడ్డీ రేటును కాస్త సడలించారు. అయినా సరే పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెంచడం వల్ల ఉద్యోగికి దీర్ఘకాలంలో లాభాలుంటాయి. ప్రస్తుతం ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలలో 12 శాతం ప్రతినెలా PF ఖాతాకు జమవుతుంది. ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ సైతం అదే మొత్తం నగదును పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూట్ చేస్తుంది.  Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

ఒకవేళ ఉద్యోగి తమ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకోవాలనుకుంటే కంపెనీ హెచ్‌ఆర్‌ను సంప్రదించాలి. పీఎఫ్ డబుల్ చేసుకోవాలన్న రిక్వెస్ట్‌ను ఆమోదం పొందేలా చూసుకోవాలి. ఇక ప్రతినెలా ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలలో 12 శాతం బదులుగా 24 శాతం నగదు పీఎఫ్ ఖాతాలో జమవుతుంది. అవసరమైతే ఉద్యోగి తన కంట్రిబ్యూషన్‌ను బేసిక్ శాలరీలో 100శాతం వరకు పెంచుకోవచ్చునని ఈపీఎఫ్ఓ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఏకే శుక్లా గతంలోనే వెల్లడించారు. అలా చేసేవారు సెక్షన్ 80సీ ప్రకారం ఆదాయపు పన్నులో ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చని సూచించారు.  ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’పై సర్వేలో షాకింగ్ విషయాలు!

కాగా, పీఎఫ్‌ను రెట్టింపు చేసుకోవడం దీర్ఘకాలిక సేవింగ్ స్కీమ్ కింద పనికొస్తుంది. రిటైర్మెంట్ సమయంలో అధికమొత్తంలో నగదు అందుతుంది. రెట్టింపు పీఎఫ్ కనుక దానికి వడ్డీ సైతం అంది ప్రయోజనం చేకూరుతుందని ఏకే శుక్లా వివరించారు. ఉద్యోగులలో చాలా మందికి ఈ విషయం తెలియక పన్ను మినహాయింపుల కోసం లేని పోని స్కీమ్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News