Jobs Notification: దేశంలో నిరుద్యోగుల సంఖ్య ప్రతి ఏడాది భారీ ఎత్తున పెరుగుతూనే ఉంది. ప్రైవేట్‌ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చి నిరుద్యోగులకు ఉపాది కల్పిస్తూ ఉన్నా కూడా ఇంకా నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఏడాది కొత్త నిరుద్యోగులు లక్షల్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వారికి ఉపాది కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రైవేట్‌ సెక్టార్ లో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అయినా కూడా కొందరు నిరుద్యోగులు పట్టు బట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఏ నోటిఫికేషన్‌ వచ్చినా కూడా లక్షల మంది, కోట్ల మంది అప్లై చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగే కోల్‌ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ లో వివిధ పోస్ట్‌ లకు సంబంధించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేయడం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ అప్లికేషన్‌ ప్రారంభం కాగా ఆగస్టు 31 వరకు గడువు ముగియబోతుంది. ఇప్పటికే భారీ ఎత్తున అప్లికేషన్ లు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. 338 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. పదవ తరగతి అర్హత తో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్‌ రావడంతో పెద్ద ఎత్తున ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారు. 18 ఏళ్లు నిండి ఉండాలి, అలాగే 30 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఓబీసీ అయితే రూ. 1180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఇతర డిపార్ట్‌మెంటల్‌ వారు ఫీజులో మినహాయింపు ఇవ్వబోతున్నారు. అధికారిక వెబ్‌ సైట్‌ కి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Minister Harish Rao: అభ్యర్థుల ప్రకటన తర్వాత కేసీఆర్ మొదటి సభ.. మెదక్‌లో ప్రగతి శంఖారావం: మంత్రి హరీశ్ రావు  


పదవ తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొనడంతో ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు. దరఖాస్తు ఆఖరు తేదీకి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో మరింత మంది అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. ముందుగా వెబ్ సైట్‌ ను ఓపెన్‌ చేసి హోం పేజీలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్‌ కింద ఆన్ లైన్ అప్లికేషన్ ని ఎంపిక చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌ ను ఫిల్‌ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు పక్రియ పూర్తి అవుతుంది. పేమెంట్‌ ను యూపీఐ లేదా క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు ద్వారా అయినా చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం మీరు అర్హులు అయితే, ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.


Also Read: Chandryaan 3 Journey: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్, 40 రోజుల ప్రయాణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి