Good News for Central Government Employees on DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అదేమంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ అంటే డీఏ హైక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అలా డీఏ అయితే కనుక ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న డిఏ శాతాన్ని 42 నుంచి 50 శాతానికి ఒక్కసారిగా పెంచుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ డియర్ నెస్ అలవెన్స్ ను ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు పెంచుతూ వెళుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది మార్చి లోనే ప్రభుత్వం ఉద్యోగుల డీఏ  శాతాన్ని నాలుగు శాతం వరకు పెంచింది. అయితే ఎప్పుడు డీఏ శాతం  పెంచుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఈసారి పెరిగితే దాదాపుగా ఎనిమిది శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. నిజానికి మార్చి నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ నాలుగు శాతానికి పెంచింది. ఆ తర్వాత అప్పటి వరకు 38% గా ఉన్న డియర్ నెస్ అలవెన్స్ 42 శాతానికి పెరిగింది. ఇక అలా పెంచిన డియర్ నెస్ అలవెన్స్ హైక్ 2023 జనవరి నుంచి అమల్లోకి వచ్చి అప్పటి నుంచి పెరిగిన జీతాలు పడుతున్నాయి.


Also Read: 7th Pay Commission Update: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూలైలో కొత్త ఫార్ములాతో పెరగనున్న DA


ఇక ఆ తరువాతి డియర్ నెస్ అలవెన్స్ 2023 జూలై నెలలో ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. తదుపరి డిఏ హైక్ కూడా దాదాపు నాలుగు నుంచి 8% వరకు ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. ఇక డియర్ నెస్ అలవెన్స్ కు సంబంధించిన ఒక రూల్ ప్రకారం ప్రభుత్వం 2016లో సెవెంత్ పే కమిషన్ అమలు చేసిన సమయంలో డియర్ నెస్ అలవెన్స్ జీరోగా మార్చారు.  అంటే నిజానికి నిబంధనల ప్రకారం డియర్ నెస్ అలవెన్స్ గనుక 50 శాతానికి చేరితే వెంటనే దాన్ని జీరో చేసి ఉద్యోగుల జీతంగా పొందే డబ్బును బేసిక్ పేతో యాడ్ చేస్తారు.


ఆ లెక్క ప్రకారం ఒక ఉద్యోగి బేసిక్ పే 18,000 అయితే ఆయనకు 50 శాతం డియర్ నెస్ అలవెన్స్ లో 9000 రావాల్సి ఉంటుంది. అయితే డిఏ 50% అయిన తర్వాత అది బేసిక్ పేకి యాడ్ చేస్తారు. అప్పుడు డియర్ నెస్ అలవెన్స్ 50% నుంచి 0కి పడిపోతుందన్నమాట. ఈ లెక్కన జూలైలో పెద్ద శుభవార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకోబోతున్నారని ప్రచారాలు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉండడంతో గత పెంపుదలలో నాలుగు శాతం ఉన్న హైక్ ని ఈసారి 8 శాతానికి చేసిన ఆశ్చర్యం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.


Also Read: Sikkim Avalanche: సిక్కింలో భారీ హిమపాతం.. ఆరుగురు మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook