Increasing Gas Cylinder Prices: ఒకవైపు కరోనా వైరస్ (Corona Crisis) కారణంగా లాక్ డౌన్ (Lock Down) వల్ల ఆదాయం లేకపోగా.... పెరుగుతున్న నిత్యావసర ధరల కారణంగా మధ్య తరగతి కుటుంబాలు మరియు మధ్య తరగతికి దిగువ గల కుటుంబాలకు బ్రతుకే భారంగా మారుతుంది. పెట్రోల్‌ (Petrol Price), డీజిల్ (Diesel Price), వంట నూనె (Cooking Oil) మరియు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరగటం.. ఇపుడు గ్యాస్ సిలిండర్ ధర (Gas Cylinder Price goind to Increase) కూడా పెరుగుతుండటం సామాన్యులపై భారం పెరుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు (August 2021), సెప్టెంబర్‌లో(September 2021) పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ రాబోయే అక్టోబర్‌లో (October 2021) కూడా పెరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. నిపుణుల వెల్లడించిన నివేదిక ప్రకారం.. గ్యాస్ సిలిండర్ ల ధర అక్టోబర్ నెల నాటికి ఉహాకు అందని విధంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 


Also Read: China Mosquitoes Mission: మొన్న కరోనా.. ఇపుడు "మిషన్ మస్కిటో".. చైనా మరొక ప్రయోగం


సాధారణంగా గ్యాస్ కంపెనీలు (Gas Company's) ప్రతినెల 1 వ తేదీన గ్యాస్ సిలిండర్ ల ధరలను సవరిస్తూ ఉంటాయి.. కావున నిపుణుల అంచనాల ప్రకారం, ముడి ఇంధనాలు (Fuel) మరియు నేచురల్ గ్యాస్ (Natural Gas Cost) ధరలు పెరుగుతుండటంతో ఇది గ్యాస్ సిలిండర్ ధరపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే నెల వరకి  గ్యాస్ సిలిండర్ ల ధరలు దాదాపు 60 శాతానికి (60% Gas Cylinder Price Will Increase) కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 


కేంద్ర ప్రభుత్వం 2014 ప్రవేశపెట్టిన డొమెస్టిక్ గ్యాస్ పాలసీ (Domestic gas Policy) నియమాల ప్రకారం, ప్రతి 6 నెలలకు ఒకసారి గ్యాస్ ధరలను ప్రభుత్వం సమీక్షిస్తుంది. అయితే ఈ సమీక్షణలో ఇతర దేశాల ధరలను బట్టి మన దేశంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం (Central Governament) నిర్ణయిస్తుంది. దీన్ని బట్టి నిపుణులు తెలుపుతున్న నివేదికల ప్రకారం వచ్చే నెలలలో గ్యాస్ సిలిండర్ ధరలు అధిక మొత్తంలో పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.  


Also Read: Sai Dharam Tej Accident CCTV Footage: వైరలైన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ CCTV ఫుటేజ్


నిపుణుల అధ్యయనాల ప్రకారం, ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ (APM Gas) ధర ఎంఎంబీటీయూ‌కు (MMBTU) 1.79 డాలర్‌గా ఉండటం మరియు ఇది 3 డాలర్ల పైకి చేరొచ్చనే అంచనాలున్నాయి. ఎంఎంబీటీయూకు 1 డాలర్ పెరిగినా కూడా కంపెనీలకు 25 నుంచి 30 శాతం ప్రాఫిట్ పెరుగుతుంది. ఇకపోతే విదేశీ మార్కెట్‌లో నేచురల్ గ్యాస్ ధర బుధవారం ఒక్క రోజే 8 శాతం పెరిగింది.


ప్రస్తుతం.. దేశంలో వివిధ నగరాల్లో గ్యాస్ ధరలు 850 రూపాయలకు పైగానే ఉన్నాయి. ఢిల్లీలో(Gas Price in Delhi ) రూ.884.50, కోల్‌కతాలో (Gas Price in Kolkata) రూ. 911, ముంబైలో (Gas Price in Mumbai) 884.50, చెన్నైలో (Gas Price in Chennai) రూ.900.50, బెంగళూరులో (Gas Price in Bangalore) రూ.887.50 ఉండగా మన హైదరాబాద్‌ (Gas Price in Hyderabad) లో రూ. 937 గా ఉంది. 


Also Read: SBI Customers Uninstall these 4 Apps: ఈ 4 యాప్స్ వాడితే మీ డబ్బులు గోవిందా.. గోవిందా..!!


అత్యధింగా కోల్‌కతా, చెన్నైలో రూ.900 పైనే ఉండగా మిగతా అన్ని రాష్ట్రాల్లో వీటి ధరలు రూ.1000కి  దగ్గరగా ఉన్నాయి. ఏది ఏమైనా... గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్, వంట నూనె ఇలా పెరిగే ధరలకు సామాన్యులు బ్రతుకు భారంగా మారుతుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook