దోమలు చాలా రకాల ప్రాణంతకర వ్యాధులను వ్యాప్తి చేస్తాయి, ప్రస్తుత వర్షకాలంలో డెంగ్యూ వ్యాధిని వేగంగా వ్యాపి చేస్తున్నాయి..
కానీ మన పొరుగు దేశం చైనా మాత్రం భిన్నంగా వారానికి 20మిలియన్ల దోమలను ఉత్పత్తి చేస్తుంది. కరోనాను ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింప చేసి మళ్లీ దోమలతో ఏం చేస్తుంది.. అనేగా మీ ఆలోచన.. పదండి అదేంటో చూద్దాం..
దోమలలో మంచి - చెడు ఎంటా అని చూస్తున్నారా..? దోమలన్ని పీల్చేవి రక్తం ఏగా మళ్లీ మంచి దోమలేంటి అనేగా మీ సందేహం..? అవును, కొన్ని దోమలు ఇతర దోమలను పెరుగుదలను నిరోధించి, పరోక్షంగా వ్యాధి వ్యాప్తిని అరికడతాయి. చైనా జరిపిన పరిశోధనలలో ఈ నిజం అని తెలగానే "మిషన్ మస్కిటో" (Mosquitoes Mission) ను ఆరంభించింది.
ఈ మంచి దోమలను చైనా ఫ్యాక్టరీలలో తయారు చేస్తుంది. చైనా (China) దక్షిణ భాగంలోని గ్వాంగ్జౌలో (Guangzhou) ఒక ఫ్యాక్టరీలో మంచి దోమల తయారీని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో ప్రతి వారం దాదాపు 20 మిలియన్ల దోమలను ఉత్పత్తి చేస్తారు. ఈ దోమల వలన ఉన్న మరొక ప్రయోజనం ఏమిటంటే.. ?? వోల్బాచియా (Wolbachia) అనే బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ చేయబడి ఉంటాయి.
చైనాలోని సన్ యాట్ సెట్ యూనివర్సిటీ (Sun Yat Set University) మరియు మిచిగాన్ విశ్వవిద్యాలయం (the University of Michigan in China) చేసిన పరిశోధనలో ప్రకారం, వోల్బాచియా బ్యాక్టీరియా (Wolbachia bacteria) సోకిన దోమలు ఆడ దోమలకు ఈ బ్యాక్టీరియా సోకేలా చేసి, వాటిలో వంధ్యత్వాన్ని (infertile) కలిగిస్తాయి. ఈ మంచి దోమలను వోల్బాచియా మెస్కిటో (Wolbachia mesquito) అని కూడా పిలుస్తారు.
మొదటగా ఈ దోమలను గ్వాంగ్జౌలోని (Guangzhou) ఫ్యాక్టరీలో పెంచుతారు. తరువాత వీటిని అడవిలో లేదా దోమల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ దోమలతో కలిసిపోయి వంధ్యత్వాన్ని కలిగిస్తాయి. ఫలితంగా సంతానోత్పత్తిని (fertility) నాశనం అవ్వటం కారణంగా దోమల పెరుగుదల తగ్గుతుంది. ఫలితంగా దోమల సంఖ్య తగ్గి వ్యాదుల వ్యాప్తి పూర్తిగా తగ్గిపోతుంది.
సాధారణ దోమలతో పోలిస్తే ఫ్యాక్టరీలో తయారు చేసిన దోమలు చాలా శబ్దాన్ని చేస్తాయి. అంతేకాకుండా, కాసేపటి తరువాత స్వతహాగా అంతమవుతాయి. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. వీటి వలన ఎలాంటి ప్రమాదాలుండవు మరియు ఇవన్ని మగ దోమలే. వీటి జన్యువులను ప్రయోగశాలలో మార్చబడతాయి.
చైనా ప్రారంభించిన ఈ మిషన్ విజయవంతమైంది, అంతేకాకుండా చైనా దేశం బ్రెజిల్లో (Brazil) కూడా ఇలాంటి ఫ్యాక్టరీ నిర్మించబోతుంది. ఈ రకం మగ దోమలను విడుదల చేసిన ప్రాంతంలో దాదాపు 96% దోమల బెడద తగ్గటమే కాకుండా వ్యాధి సంక్రమణ తగ్గింది. ట్రయల్ దశలోనే ఈ ప్రయోగం అద్భుతమైన విజయం సాధించింది.