Sai Dharam Tej Accident CCTV Footage: వైరలైన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ CCTV ఫుటేజ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ CCTV ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.. మీరే ఒకసారి చూడండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2021, 11:50 AM IST
  • నిలకడగా ఉన్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం
  • మెగా హీరోపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • వైరల్ అయిన యాక్సిడెంట్ తాలుకు CCTV ఫుటేజ్
Sai Dharam Tej Accident CCTV Footage: వైరలైన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ CCTV ఫుటేజ్

Sai Dharam tej Accident CCTV Footage: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. రాత్రి 8:05 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి-ఐకియా చౌరస్తా (Canble Bridge-Ikea Chowrasta ) మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. 

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనా స్థలం రాయదుర్గం పోలీసు స్టేషన్ (Rayaduram Police Station) పరిధిలోకి వస్తుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీ (CCTV Footage) ఆధారంగానే ఈ కేసు విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయిన చోట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు (Sai dharam tej accident CCTV visuals) సైతం బహిర్గతమయ్యాయి. 

Also Read: Sai dharam tej accident case CCTV video: సాయిధరమ్ తేజ్‌పై కేసు నమోదు.. CCTV visuals ఆధారంగా కేసు దర్యాప్తు

ప్రమాదం జరిగినప్పటీ సీసీ టివి ఫుటేజ్ సేకరించిన పోలీసులు సాయి ధరమ్ తేజ్ వేగంగా బైక్ నడపటం వల్లే, బైక్ కంట్రోల్ అవ్వలేదని... ఫలితంగా యాక్సిడెంట్ అయిందని తెలిపారు. మెగా హీరోపై కేసు కూడా బుక్ చేసారు. పోలీసులు విడుదల చేసిన యాక్సిడెంట్ ఫోటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య  పరిస్థితి నిలకడగా ఉందని  అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. 24 గంటల పాటు ఐసీయూలోనే సాయి తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. వైరల్ గా మారిన సీసీ టివి ఫుటేజ్  మీ కోసం...

Also Read: Vinayaka chavithi 2021: వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది ? చూస్తే Mithya Dosha నివారణ ఏంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News