రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ముందుకు తీసుకొచ్చారు. విద్యా ఉద్యోగావకాశాలు ఎస్సీ,ఎస్టీల తరువాత అత్యధిక శాతం ఓబీసీకి వెళతాయి. ప్రస్తుతం ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. అయితే ఈ ఓబీసీ కోటాలో ఉప కోటా తీసుకురావాలని ప్రధాని మోదీ భావిస్తున్నారట. ఉపకోటా పేరు ఎంబీసీ (ఓబీసీలలలో అత్యంత వెనుకబడిన వర్గాలు).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉప కోటా అంశాన్ని పరిశీలించేందుకు కమిషన్ వేశామని, నివేదిక వచ్చాక ఓబీసీలోనే ఎంబీసీలంటూ ఉప కోటా తీసుకువస్తామన్నారు. 2019 ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్ లలో ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతో ఎంబీసీ నినాదాన్ని మోదీ తెస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.


ఇటీవలే యూపీలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, ఎంబీసీల గురించి తొలిసారి మాట్లాడారు. యుపీలో ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నందున.. ఎంబీసీ ఓటర్లను తమవైపు తిప్పుకొనేలా బీజేపీ భావిస్తోంది.  


యుపీ ఓబీసీల్లో మెజారిటీ వర్గాలు ఎస్పీ పార్టీ వెంట ఉన్నాయి. ఓబీసీల్లో సింహభాగం యాదవులు, ముస్లింలు. మిగిలిన వెనుకబడిన కులాలు- కర్షకులు, చేతి వృత్తుల వారు, చిరు వ్యాపారులులే ఈ ఎంబీసీల్లో ఉన్నాయి. ఓబీసీలలో ఎంబీసీలు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నారు. అయితే  వీరికి రాజకీయ, విద్యా ఉద్యోగావకాశాలు ప్రాధాన్యత లేదు. ఎంబీసీలకు గనక ప్రత్యేక కోటా ఉంటే అది బీజేపీకి రాజకీయంగా బాగా కలిసొస్తుంది. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌తో సమానంగా ఓబీసీ కమిషన్‌ను కూడా చేసేందుకు గతంలో మోదీ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినా.. అది సాధ్యపడలేదు. 2017లో యూపీలో బీజేపీకి 42.7శాతం ఓట్‌ షేర్‌ వచ్చింది. వచ్చే ఏడాది  కూడా ఇంతే స్థాయిలో సాధించాలంటే ఎంబీసీ రిజర్వేషన్ల లాంటి వ్యూహాలు కావాలి. యూపీలో రాజ్‌నాథ్‌ సీఎంగా ఉన్నపుడు ఈ ఎంబీసీల ఆలోచన చేశారు. అయితే గొడవలు చెలరేగడంతో తాత్కాలికంగా పక్కనపెట్టాశారు.