National Highways New System With GPS: జాతీయ రహదారులపై రయ్యిన దూసుకెళ్దామంటే టోల్‌ గేట్లు ఒక అడ్డంకిగా మారాయి. టోల్‌ చెల్లించేందుకు సాధారణంగా పది నిమిషాలకు పైగా సమయం పడుతుంది. వారాంతాలు, పండుగ రోజుల్లోనైతే అర్ధ గంట, గంట కూడా పట్టవచ్చు. దీని ద్వారా టోల్‌ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరడంతో సమయం వృథా అవుతోంది. దీని ఫలితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ఆలస్యంగా మారుతోంది. ఈ టోల్‌గేట్‌ విషయమై కేంద్ర ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు అమల్లో ఉన్న ఫాస్టాట్‌ విధానానికి బై బై చెప్పేసి కొత్త విధానం అమలు చేయాలని భావిస్తున్నది. కొత్త విధానం అమల్లోకి వస్తే జాతీయ రహదారిపై ఎక్కడ.. ఏ టోల్‌గేట్‌ వద్ద ఆగాల్సిన పనే లేదు. ఆ విధానం ఏమిటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Non Stick Pan: నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా అయితే ఈ టిప్స్ మీకు హెల్ప్ ఫుల్ 


గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు నగదు రూపంలో (మాన్యువల్‌)గా టోల్ ఛార్జీలు చెల్లించేవాళ్లం. ఇప్పుడు క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనినే ఫాస్టాగ్‌ అంటారు. ఫాస్టాగ్‌ స్థానంలో కేంద్రం విధానం తీసుకురాబోతున్నది. కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ విధానంలో రీఛార్జ్ చేయాలి, క్యాష్ బ్యాలెన్స్ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఇలాంటి తలనొప్పులు లేకుండా ఫాస్టాగ్‌లకు జీపీఎస్‌ అనుసంధానం చేసి టోల్ చార్జీలు వసూలు చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులు భావిస్తున్నారు. అంటే జీపీఎస్‌ను, మీ ఫోన్‌ నంబర్‌, మీ బ్యాంక్‌ ఖాతా నంబర్‌ను అనుసంధానం చేసి టోల్‌ చార్జీ వసూలు చేస్తారు. అంటే జాతీయ రహదారిపై వెళ్లే మీ వాహనం జీపీఎస్‌ను ఆధారంగా చేసుకుని టోల్‌ చార్జీ తీసుకుంటారు. జీపీఎస్‌ను ట్రాక్‌ చేసి మీ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా మీ బ్యాంక్‌ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా టోల్‌చార్జీ వసూలు చేస్తారని సమాచారం.

Also Read: Tirumala: మండుతున్న ఎండలు.. నీళ్ల కోసం తిరుమలలో ఏనుగుల హల్‌చల్‌?


ఫాస్టాగ్‌లు అనేవి 2016లో అమల్లోకి తీసుకొచ్చారు. ఇవి ఎలక్ట్రానిక్ ట్యాగ్స్‌ మాదిరి ఉన్నాయి. టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. దీనిద్వారా ట్రాఫిక్ రద్దీ, వేచి ఉండే సమయం కొంత తగ్గింది.  అయితే ఈ విధానంలోనూ కొంత సమస్యలు ఉన్నాయి. తక్కువ బ్యాలెన్స్ అలర్ట్స్, సాంకేతిక లోపాలతో వాహనదారులు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారం చూపిస్తూ జీపీఎస్‌ ఆధారిత టోల్ విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఒక చోట ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది.


జీపీఎస్‌ ఆధారిత టోల్ సిస్టమ్ ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం. ప్రస్తుతం జీపీఎస్‌ ఆధారిత టోల్‌ విధానాన్ని ముంబైలోని అటల్ సేతు వంటి కొన్ని రహదారులపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ప్రత్యేక కెమెరాలతో కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేయడం ద్వారా జీపీఎస్‌ టోల్‌ విధానం పనిచేస్తుంది. కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్‌) పరిజ్ఞానంతో పని చేస్తాయి. ఈ విధానంలో వాహనం రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి టోల్ చార్జీ వసూలు అవుతుంది. జీపీఎస్‌ ఆధారిత టోల్ విధానం ఫాస్టాగ్‌ల కంటే మరింత సులభతరం.


జీపీఎస్‌ ఆధారిత టోల్‌ విధానం అమల్లోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన పనే లేదు. ఒక మాట చెప్పాలంటే టోల్‌ గేట్లే అవసరం లేదు. ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్‌ జామ్‌ అనే సమస్య ఉత్పన్నం కాదు. జాతీయ రహదారిపై ఎక్కడా వాహనాలు ఆపకుండా వీలైనంత తొందరలో మన గమ్యం చేరడానికి జీపీఎస్‌ ఆధారిత టోల్‌ విధానం దోహదం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ విధానం విజయవంతమైతే దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేసే అవకాశం ఉంది. ఏప్రిల్‌ నెలారంభంలో ఈ విధానం అమలుచేసేందుకు కేంద్రం ప్రక్రియ ప్రారంభించింది. ఈ విధానం అమల్లోకి వస్తే టోల్‌ గేట్ల వద్ద ఆగకుండా జాతీయ రహదారులపై రయ్యిన దూసుకెళ్లవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook