Gratuity Nominee: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో లభించే పలు ప్రయోజనాలతో ఒకటి గ్రాట్యుటీ. గ్రాట్యుటీ విషయంలో సంబంధిత ఉద్యోగి నామినీ ఎంచుకోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ ఏమైనా జరిగితే కుటుంబ సభ్యులకు గ్రాట్యుటీ అందాలంటే నామినీ తప్పకుండా ఉండాల్సిందే. నామినీ ఎంచుకునే ప్రక్రియ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఏదైనా సరే పీఎఫ్ ప్రయోజనాలతో పాటు గ్రాట్యుటీ కూడా లభిస్తుంది. ఇది దీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగికి గ్రాట్యుటీ లభిస్తుంది. గ్రాట్యుటీ అనేది ఆ ఉద్యోగి లాయల్టీకు సంస్థ ఇచ్చే రివార్డ్ వంటిది. నిర్ణీత కాలం తరువాత ఉద్యోగం వదిలేసినా లేదా పదవీ విరమణ సమయంలో ఆ ఉద్యోగికి గ్రాట్యుటీ అందుతుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసు మధ్యలో మరణిస్తే గ్రాట్యుటీ కుటుంబీకులకు అందాలంటే నామినీ ఎంచుకోవల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువమంది నామినీలుంటే గ్రాట్యుటీ మొత్తం ఎలా పంచాలో కూడా ముందే వివరించవచ్చు. 


గ్రాట్యూటీ నామినీ ఎంచుకునేందుకు ఫామ్ ఎఫ్ అవసరమౌతుంది. ఈ ఫామ్ ద్వారా సంబంధిత ఉద్యోగి నామినీ ఎవరో ఎంచుకోవాలి.  ఒకరి కంటే ఎక్కువమందిని నామినీగా ఇవ్వవచ్చు. మధ్యలో ఎప్పుడైనా మార్చాలన్నా మార్చవచ్చు.1972 గ్రాట్యుటీ పేమెంట్ యాక్ట్ ప్రకారం కుటుంబంలో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా మీపై ఆధారపడేవారెవరికైనా నామినీ ఇవ్వచ్చు. నామినీ లేకపోతే ఉద్యోగి మరణానంతరం ఆ గ్రాట్యుటీని లీగల్ వారసులు ఎవరుంటే వారికిస్తారు. అయితే దీనికి సమయం పడుతుంది. 


Also read: 8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు, ఉద్యోగుల జీతం ఎన్ని రెట్లు పెరుగుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.