కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి నేపధ్యంలో వారి సేవలు నిజంగా అభినందనీయం. అనిర్వచనీయం. ప్రాణాలొడ్డి మరీ ఇతరుల ప్రాణాల్ని రక్షిస్తున్నారు వారంతా. అందుకే దేశ స్వాతంత్య్ర వేడుకల్లో అరుదైన గౌరవం అందిచాలని కేంద్ర ప్రభుత్వం ( Central Government ) నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా  వారియర్స్ ( Corona Warriors ). కరోనా సంక్షోభ సమయంలో ప్రాచుర్యం పొందిన పేరు. కోవిడ్ 19 వైరస్ ( Covid 19 Virus ) నేపధ్యంలో ముందువరుసలో ఉండి సేవలందించారు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ఇతరుల ప్రాణాల్ని కాపాడుతున్నారు. అందుకే వారిని కరోనా వారియర్స్ గా పిలుస్తున్నారు. ఈ వారియర్స్ లో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో దేశం మొత్తం చప్పట్ల ద్వారా, దీపాల ద్వారా, హెలికాప్టర్ పై పూలవర్షం కురిపిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవం అందించారు. 


ఇప్పుడు మరో అరుదైన గౌరవం లభించనుంది. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన అంటే ఆగస్టు 15 వేడుక ( August 15 Celebrations ) లకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాలకు కూడా ఈ మేరకు సూచనలు జారీ చేసింది. రాజధాని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని తెలిపింది. కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో భారీగా జనం హాజరుకాకుండా చూడాలని కోరింది. వేడుకల్లో భాగంగా నిర్వహించే మార్చ్ ఫాస్ట్  కార్యక్రమానికి పోలీసు, ఆర్మీ, పారా మిలటరీ, ఎన్ సీసీ దళాలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని మార్గదర్శకాల్ని జారీ చేసింది. Also read; Oxford Vaccine: ఇండియాలో మూడవ ఫేజ్ వ్యాక్సిన్ ట్రయల్స్