తమిళ సినీ నటుడు విశాల్ కార్యాలయంపై ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు దాడులు చేశారు. హీరో విశాల్ 'మెర్శల్‌' సినిమాకు మద్దతు తెలిపిన క్రమంలో ఈ దాడులు జరిగినట్లుగా తమిళ సినీ పరిశ్రమ భావిస్తోంది. కమల్, రజినీ లాంటి స్టార్స్ కూడా 'మెర్శల్‌' సినిమాకు మద్దతు తెలిపారు. మరి వారి ఇళ్లపై 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎందుకు దాడులు జరగలేదో అర్థం కావటం లేదని కొందరు తమిళ సినీ ప్రముఖులు చర్చించుకున్నట్లు సమాచారం. 


విశాల్ సినిమాకు మద్దతు తెలుపుతూ.. బీజేపీపై విమర్శలు చేశారు. ఈ చిత్రాన్ని ఇంటర్నెట్ లో చూశానని చెప్పిన బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. బహుశా దాడుల వెనుక ఇదే ప్రధాన కారణం కావచ్చు. దక్షిణ భారత చలనచిత్ర మండలి కూడా 'మెర్శల్‌' కే ఓటేసింది. చిత్రంపై అనవసర రాద్ధాంతం తగదని సూచించింది. 


ఐటీ దాడులపై విశాల్ స్పందించారు. ఇది దిగజారుడు రాజకీయాలకు అద్దంపట్టే విధంగా ఉందని చెప్పారు. తాను చట్టప్రకారంగానే ఈ వ్యవహారాన్ని ఎదుర్కొంటానని చెప్పారు.