GSTR: జీఎస్టీఆర్-3 రిటర్న్ ( GST Return Filing ) దాఖలు చేయడానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జీఎస్టీ చెల్లింపుదారులకు ఉపశమనం కలిగింది. జీఎస్టీ-3కి సంబంధించి ఆలస్య రుసుమును ( GST 3 Late Fee ) తగ్గిస్తున్నట్టు సెంట్రల్ డైరక్ట్ ట్యాక్స్ బోర్డ్ (CBIC ) ప్రకటించింది. సీబీసిఐ జీఎస్టీపై చేసిన ఈ ప్రకటన వల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. జులై 2017 నుంచి జులై 2020 మధ్య కాలానికి సంబంధించిన జీఎస్టీఆర్3ను ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 లోపు చెల్లిస్తే ఆలస్య రుసుమును కేవలం 500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపింది.  Also Read : Moj app: TikTok కి ప్రత్యామ్నాయంగా మరో యాప్ లాంచ్ చేసిన ShareChat


అయితే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేని సందర్భంలో లేట్ ఫీజును చెల్లించాాల్సిన అవసరం లేదు అని సీబీఐసీ (Central Direct Income Taxes and Customs ) తెలిపింది.  అయితే ఈ రుసుము కేవలం జీఎస్టీఆర్ -3కు మాత్రమే వర్తిస్తుంది అని స్పష్టం చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..