Gujarat Second Phase Election: గుజరాత్ ఎన్నికల రెండో, చివర దశ పోలింగ్‌కు కౌండౌన్ స్టార్ట్ అయింది . సోమవారం రాష్ట్రంలోని మొత్తం 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో 61 రాజకీయ పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 285 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రెండో విడత ప్రచారానికి శనివారం బ్రేక్ పడగా.. నేడు పోలింగ్‌కు ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. కాగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో సోమవారం ఉదయం ప్రధాని తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లోని నారన్‌పురాలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటు వేయనున్నారు.


తల్లి హీరాబెన్‌ను కలిసి మోదీ ప్రధాని మోదీ 


ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీర్వాదం కోసం గాంధీనగర్ నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ తన తల్లితో దాదాపు 45 నిమిషాలపాటు గడిపారు. అనంతరం గాంధీనగర్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ అమిత్ షా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ఇతర సీనియర్ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. సోమవారం ఉదయం అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలోని నిషాన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా మేజిస్ట్రేట్ ధవల్ పటేల్ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, గత ఎన్నికలలో కూడా ఇక్కడ తన ఓటు వేశారు. ఈ పోలింగ్ స్టేషన్ అహ్మదాబాద్ నగరంలోని సబర్మతి అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది.


సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీలకు ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 1న 19 జిల్లాల్లోని 89 స్థానాలకు మొదటి దశలో ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే.


182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 92 సీట్లు అవసరం. గత ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రాగా.. కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్‌లో 27 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అటు ఆప్ పార్టీ కూడా పోటీ చేస్తుండడంతో గుజరాత్ ఎన్నికల ఆసక్తికరంగా మారాయి. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో పాటు గుజరాత్ ఫలితాలు కూడా రానున్నాయి.


Also Read: KL Rahul: హీరోనే విలన్ అయ్యాడు.. కేఎల్ రాహుల్ చేసిన ఒకే ఒక తప్పు.. ఆ క్యాచ్ పట్టుంటే..!  


Also Read: Ys Jagan Delhi Tour: జీ20 అఖిలపక్ష సమావేశం రేపే, ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి