Kl Rahul Drop Catch Video: ఉత్కంఠభరితంగా సాగిన తొలివన్డేలో భారత్‌పై బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. బంగ్లా ఆల్‌రౌండర్ మెహీది హసన్ (38) అద్భుతంగా పోరాడి జట్టును గెలిపించాడు. ముస్తాఫిజూర్ రెహ్మాన్ (10)తో కలిసి ఆఖరి వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జోడించి బంగ్లాను విజయ తీరాలకు చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే పరిమితమైంది. ఛేజింగ్‌లో బంగ్లాను కట్టడి చేసిన భారత బౌలర్లు.. 136 పరుగులకు తొమ్మిది వికెట్లు తీసి గెలుపుపై ఆశలు కల్పించారు. కానీ చివర్లో పట్టుతప్పడంతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ చేసిన ఒకే తప్పుతో విలన్‌గా మారిపోయాడు.
బంగ్లాదేశ్‌ను 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన సమయంలో.. భారత్ విజయానికి కేవలం ఒక వికెట్ మాత్రమే అవసరం కాగా, బంగ్లాదేశ్ 51 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో మెహీది హసన్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే శార్ధుల్ ఠాకూర్ వేసిన 43వ ఓవర్లలో హసన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు.
ఈ ఓవర్ మూడో బంతికి మెహదీ హసన్ బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి బంతి గాలిలో లేచింది. వికెట్ కీపర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ చాలా ఈజీగా క్యాచ్ అందుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ కేఎల్ రాహుల్ చేతిలో నుంచి బాల్ కిందపడిపోయింది. దీంతో లైఫ్ అందుకున్న హసన్.. 39 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. బ్యాటింగ్‌లో భారత్‌ను ఆదుకుని హీరోగా మారిన కేఎల్ రాహుల్.. ఆ తరువాత కీలక సమయంలో సులువైన క్యాచ్‌ను నేలపాలు చేసి విలన్‌గా మారిపోయాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 186 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా కేవలం 41.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. కేఎల్ రాహుల్ అత్యధికంగా 73 పరుగులు చేశాడు. ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఒక వికెట్ చేతిలో ఉండగానే సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మెహదీ హసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ఇన్నింగ్స్‌తో అతను బంగ్లాదేశ్‌లో హీరోగా మారిపోయాడు. రెండు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరగనుంది.
Also Read: Ind Vs Ban: ఉత్కంఠభరిత పోరులో బంగ్లా విజయం.. చివర్లో హ్యాండిచ్చిన భారత బౌలర్లు
Also Read: Virat Kohli: లిటన్ దాస్ స్టన్నింగ్ క్యాచ్.. ఆశ్చర్యపోయిన విరాట్ కోహ్లీ.. వీడియో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి