Bharatsinh Solanki Issue: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కాంగ్రెస్ నేతకు బడితపూజ..అసలేమి జరిగిందంటే..!
Bharatsingh Solanki Issue: సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వీఐపీ ఉండటంతో నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రజలకు చెప్పాల్సిన నేతే ఇలా చేస్తే ఎలా అని మండిపడుతున్నారు. ఇంతకు ఎవరా నేత..ఏమిటా కథా..?
Bharatsingh Solanki Issue: సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వీఐపీ ఉండటంతో నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రజలకు చెప్పాల్సిన నేతే ఇలా చేస్తే ఎలా అని మండిపడుతున్నారు. ఇంతకు ఎవరా నేత..ఏమిటా కథా..?
గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత భరత్‌సింగ్ సోలంకీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన మరో మహిళతో ఉన్న సమయంలో సోలంకీ భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరిని తన మాటలతో ఉతికిపడేసింది. తన బంధువులు, అనుచరులతో కలిసి ఆ యువతిపై దాడికి దిగింది. ఆమెను కాపాడేందుకు కాంగ్రెస్ నేత సోలంకీ విపరీతంగా ప్రయత్నించారు. ఐనా వారు లెక్కచేయలేదు. దీనిపై న్యాయ పోరాటం చేయడని చెప్పినా వారు వినలేదు.
ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భరత్ సింగ్ సోలంకీకి ఆ యువతికి వివాహేతర సంబంధం ఉందని ఆయన భార్య ఆరోపిస్తోంది. ఆమె వల్ల తన జీవితం నాశనం అయ్యిందని వాపోతోంది. భరత్‌సింగ్, ఆయన భార్యకు గతకొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక పదువుల్లో ఉన్న వ్యక్తి ..భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న నేరాల్లో చాలా వరకు వివాహేతర సంబంధాలే ఉన్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు ..చాలా కేసులన్నీ ఇవే మూలలు బయట పడుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి చాలా మంది తమ పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. కుటుంబాలను సైతం నడి వీధికి లాగుతున్నారు. దీంట్లో వీఐపీలు సైతం ఉంటున్నారు.
Also read:Video: ఆమె చుట్టూ ఉడతలు, పక్షులు.. హృదయాన్ని హత్తుకునే వీడియో... ఎంత బాగుందో...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook