గుజరాత్ ఎన్నికల పోరులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ కు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఎన్సీపీ.. సడన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసిపోటీ చేసేది లేదని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని సీట్లలో పోటీ చేస్తామని ఎన్సీపీ సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌ తెలిపారు.  కాంగ్రెస్‌తో కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని తొలుత భావించామని.. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, అయితే ఆ పార్టీ తాత్సారం చేస్తుండడంతో తాము సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీట్ల సర్దుబాటులో ఎస్సీపీ అసంతృప్తి


డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్‌ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో  77 స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ జాబితా ప్రకటించిన మర్నాడే ఎన్సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. సీట్ల సర్దుబాటులో ఇరువురి మధ్య రాజీ కుదరకపోవడమే ఎన్సీపీ సంచలన నిర్ణయానికి కారణమైంది. ఇప్పటికే హార్టిక్ మంతనాలపై కూడా గందరోగళం నెలకొంది. కాగా ఎస్పీపీ తీసుకున్న నిర్ణయం.. కాంగ్రెస్ కు మరింత ఇబ్బంది కరంగా మారింది.