Indias Youngest Billionaire Parel kapoor: భారత దేశం ఇప్పుడు అన్నిరంగాలలో కూడా అభివృద్ధి చెందిందని చెప్పుకొవచ్చు. ప్రపంచ దేశాలకు అనేక రంగాలలో గట్టి పోటీని కూడా ఇస్తుంది. ఇప్పటికే టెక్నాలజీ రంగంలో తనదైన మార్కుతో దూసుకుపోతుంది. భారత విద్యావిధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఎడ్యుకేషన్ స్టాండెర్డ్స్‌ కూడా పెరిగాయి. దీనికి తగ్గట్టుగానే యువతకూడా కష్టపడి తమ తమకు ఇష్టమైన రంగలో ట్యాలెంట్ చూపించి.. శభాష్ అన్పించుకుంటున్నారు. ప్రస్తుతం 27 ఏళ్ల పెరల్ కపూర్ వార్తలలో నిలిచాడు. ఇతగాడు.. భారత దేశానికి చెందిన యంగెస్ట్ బిలయనీర్. అతని నికర విలువ: ₹ 9,100 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video:మేడం సర్.. మేడం అంతే.. చమ్మక్ చల్లో పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..


పెరల్ కపూర్..  Zyber 365 కంపెనీ వ్యవస్థాపకుడు.  CEO అయిన పెరల్ కపూర్, $1.1 బిలియన్ల (రూ. 9,129 కోట్లు) నికర విలువను కలిగి ఉన్నాట్లు తెలుస్తోంది. ఒక స్టార్టప్ తో తన కెరియర్ ప్రారంభించి అంచలెంచలుగా ఎదిగి ప్రస్తుతం బిలియనీర్ గా ఎదిగి వార్తలలో నిలిచాడు. 2023 మే నెలలో పెరల్..  Zyber 365 ను ప్రారంభించాడు. ఇది.. Web3, AI- ఆధారిత OS స్టార్ట్-అప్, ఇది రిటైల్ రంగానికి గట్టి పొటిని కూడా ఇచ్చింది.  అంతే కాకుండా.. యునికార్న్ హోదాను కూడా సాధించింది. మూడు నెలల్లోనే.. యునికార్న్ హోదాను సాధించింది.  $1 బిలియన్ కంటే ఎక్కువ విలువైన స్టార్టప్‌ను యునికార్న్ అంటారు.


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రస్తుతం దీని  కార్యకలాపాలు యాక్టివ్ గా సాగుతున్నాయి. దీని మెయిన్ ఆఫీస్ లండన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశం, ఆసియాలో అత్యంత వేగవంతమైన యునికార్న్‌గా ప్రశంసించబడింది. దీని విలువ $1.2 బిలియన్లు (సుమారు ₹ 9,840 కోట్లు). Zyber 365 వ్యవస్థాపకుడు,  CEO అయిన పెర్ల్ కపూర్ కంపెనీలో 90% వాటాలను కలిగి ఉన్న విశేషమైన నికర విలువ $1.1 బిలియన్లు (రూ. 9,129 కోట్లు) కలిగి ఉన్నారు. ఈ స్టార్టప్ ఇటీవలే సిరీస్ A ఫండింగ్‌లో $100 మిలియన్లను పొందింది, Zyber 365లో అపారమైన సామర్థ్యాన్ని గుర్తించిన వ్యవసాయ సంస్థ అయిన SRAM & MRAM గ్రూప్ నుండి 8.3% పెట్టుబడి వచ్చింది.


Read More: Janhvi Kapoor: రెడ్ క‌ల‌ర్ టాప్‌లో జాన్వీ క‌పూర్ అందాల జాత‌ర‌..


క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి MSC ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ (CFA పాత్‌వే) గ్రాడ్యుయేట్ అయిన కపూర్, Web3 టెక్నాలజీ రంగంలో గొప్ప ఆవిష్కరణలు చేశాడు. జైబర్ 365కి ముందు, పెరల్ కపూర్ తన జర్నీలో.. AMPM స్టోర్‌లో ఆర్థిక సలహాదారుగా,  యాంటీయర్ సొల్యూషన్స్ కోసం వ్యాపార సలహాదారుగా పనిచేశారు. అతని వ్యవస్థాపక స్ఫూర్తి ఫిబ్రవరి 2022లో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ని కనుగొనేలా చేసింది. బ్లాక్‌చెయిన్, AI, సైబర్‌సెక్యూరిటీ వంటి వాటిపై తన దైన స్టైల్ రిసెర్చ్ చేశాడు.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook