Cable Bridge Collapse Tragedy: గుజరాత్‌లోని మోర్బీలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అకస్మాత్తుగా వంతెన విరిగిపోవడంతో పాటు బ్రిడ్జ్‌పై నిలబడి ఉన్నవారు మచ్చు నదిలో పడిపోవడం వీడియోలో కనిపిస్తోంది. మోర్బీ ప్రమాదంలో ఇప్పటివరకు 141 మంది మరణించినట్లు సమాచారం. 150 మందికి పైగా ప్రజలను అధికారులు రక్షించారు. ఈ ఘటనలో చాలా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మోర్బిలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి.. సహాయక చర్యల గురించి ఆరా తీశారు.  ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు. అనంతరం మోర్బిలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మోర్బీ ప్రమాదంలో గాయపడిన వారికి ఈ రోజు సాయంత్రం 4 గంటలకల్లా పరిహారం అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. 


 



మోర్బీ ప్రమాదంపై దర్యాప్తున రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. బ్రిడ్జి పనులు నిర్వహిస్తున్న కంపెనీపై కేసు నమోదు చేసినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ చీఫ్ అధికారి అనుమతి లేకుండా వంతెనను తెరిచినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందకుండానే బ్రిడ్జ్ తెరిచినట్లు సమాచారం.


ఈ వంతెన నిర్వహణ బాధ్యతను 15 సంవత్సరాల పాటు (మార్చి 2022 నుంచి 2037) మోర్బి మునిసిపాలిటీ అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్)కు కాంట్రాక్ట్ కింద అప్పగించింది. ఈ ఒప్పందం ప్రకారం.. టిక్కెట్ల ధరలను పెంచే నిబంధనలను కూడా ఇప్పటికే నిర్ణయించారు. ఒక సంవత్సరం వ్యవధి పూర్తయిన తర్వాత మాత్రమే టిక్కెట్ ధరను పెంచాలి. 


ఈ బ్రిడ్జి నిర్వహణకు కంపెనీకి 8-12 నెలల గడువు ఇవ్వాలని ఈ ఒప్పందంలో రాశారు. అయితే అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కేవలం 5 నెలల్లో వంతెనను తెరిచింది. సరిగా మరమ్మతులు చేయకపోవడంతో ఐదు రోజుల్లోనే కూలిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో తెలియనున్నాయి.


Also Read: Kohli's Room Video Leak: విరాట్ కోహ్లి హోటల్ రూమ్ వీడియో లీక్.. నెట్టింట వైరల్


Also Read: Morbi Bridge Collapse Updates: బీజేపీ ఎంపీ కుటుంబంలో తీవ్ర విషాదం.. కేబుల్ బ్రిడ్జ్‌ ప్రమాదంలో 12 మంది మృతి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook