లుధియానా: శివసేన కీలకనేతను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన పంజాబ్‌లో కలకలం రేపుతోంది. శివసేన పంజాబ్ ఉపాధ్యక్షుడు అమిత్ ఆరోరా వాహనంపై శనివారం కాల్పులు జరిపారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో శివసేన హిందూస్తాన్ యువ విభాగం అధ్యక్షుడు మణి షెరా వాహనం కూడా ఉంది. లుధియానాలో శనివారం ఈ ఘటన జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: టాలీవుడ్ దర్శకుడి ఇంట విషాదం..


See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా


కాల్పులు జరిపిన సమయంలో అమిత్ అరోరా, మణి షెరాలు పార్టీ కార్యాలయం లోపల ఉన్నారు. పార్టీ నేతల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. గతంలో జరిగిన ఘటనల ఆధారంగా అమిత్ ఆరోరాకు సెక్యూరిటీ కల్పిస్తున్నామని లుధియానా పోలీస్ కమిషనర్ రాకేష్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు.


మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి  


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..