Woman jumped from moving auto in Gurugram: ఆటోలో ఇంటికి బయలుదేరిన ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. వెళ్లాల్సిన దారిలో కాకుండా... డ్రైవర్ మరో దారిలోకి ఆటోను మళ్లించడంతో ఆమెకు టెన్షన్ మొదలైంది. ఆ దారిలోకి ఎందుకు తీసుకెళ్తున్నావంటూ పలుమార్లు అతని భుజంపై తట్టి ప్రశ్నించింది. అయినా అతను వినిపించుకోలేదు సరికదా... ఆటోను రయ్యిమని పరుగులు పెట్టించాడు. దీంతో తనను కిడ్నాప్ చేస్తున్నాడేమో అన్న అనుమానంతో... ఆ మహిళ ఆటో నుంచి దూకేసింది. హర్యానాలోని (Haryana) గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిష్ఠ (28) అనే మహిళ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ట్విట్టర్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం... మంగళవారం (డిసెంబర్ 21) మధ్యాహ్నం 12.30గం. ప్రాంతంలో సెక్టార్ 22 ప్రాంతంలోని మార్కెట్ వద్ద నిష్ఠ ఓ ఆటో ఎక్కింది. అక్కడి నుంచి ఆమె ఇంటికి చేరేందుకు 7 నిమిషాల సమయం పడుతుంది.


ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ భక్తి పాటలు వింటుండగా.. నిష్ఠ వెనక సీట్లో కూర్చొని ఉంది. అలా కొద్ది దూరం వెళ్లాక ఒక టీ పాయింట్ వచ్చింది. అక్కడి నుంచి కుడి వైపుకు వెళ్తే నిష్ఠ ఇల్లు వస్తుంది. కానీ డ్రైవర్ ఆటోను ఎడమవైపు తిప్పాడు. ఎడమ వైపు ఎందుకు తిప్పావని నిష్ఠ డ్రైవర్‌ను అడగ్గా... అతను పట్టించుకోలేదు. పైగా దేవుడి పేరును బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో అసలేం జరుగుతుందో నిష్ఠకు అర్థం కాలేదు.


దాదాపు 8-10సార్లు అతని భుజంపై తట్టి... ఆ దారిలోకి ఎందుకు తీసుకెళ్తున్నావని అడిగింది. కానీ ఆమె మాటలు ఏమాత్రం వినిపించుకోకుండా అతను ఆటోను పరుగులు పెట్టించాడు. ఇక ఆ సమయంలో బయటకు దూకేయడం తప్ప ఆమెకు మరో మార్గం కనిపించలేదు. ధైర్యం కూడదీసుకుని కదులుతున్న ఆటో నుంచి బయటకు దూకేసింది. పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అక్కడి నుంచి మరో ఆటోలో ఇంటికి చేరింది.


అలా కిందకు దూకేసిన సమయంలో తాను ఆటో నంబర్ నోట్ చేసుకోవడం మరిచిపోయానని పేర్కొంది. నిజానికి ఆ సమయంలో ఆటో డ్రైవర్ మళ్లీ ఎక్కడ వెనక్కి వస్తాడేమోనని భయపడినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనల పట్ల (Viral News) అప్రమత్తంగా ఉంటారనే ఉద్దేశంతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నట్లు తెలిపారు.



 


Also Read: Madras HC: కోర్టు విచారణ జరుగుతుండగా మహిళతో న్యాయవాది రాసలీలలు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook