Guwahati-Bikaner Express Derails: పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది.  రాష్ట్రంలోని జల్‌పైగురి జిల్లాలోని దొమోహనీ వద్ద గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ (15633) రైలు పట్టాలు (Guwahati-Bikaner Express Derails) తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సాయంత్రం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు భారతీయ రైల్వే (Indian Railways) ఓ ప్రకటనలో తెలిపింది. 12 బోగీలు పట్టాలు తప్పాయని స్పష్టం చేసింది. సమాచారం అందిన వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్, మెడికల్ వ్యాన్​ను ఘటనా స్థలికి పంపినట్లు తెలిపింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పాట్నా నుండి గౌహతి వెళుతున్న రైలు... మైనాగురి దాటుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ సాయంత్రం 5 గంటలకు రైలు పట్టాలు (train derailed) తప్పింది. మరికొన్ని బోగీలు ట్రాక్ బయటకు వచ్చి పల్టీలు కొట్టాయి. ఈ ప్రమాదాన్ని అలీపుర్‌దువార్ డీఆర్ఎమ్ (DRM) ధృవీకరించింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయని.. వారిని సమీప ఆసుపత్రికి తరలించామని జల్పాయిగురి పోలీసు సూపరింటెండెంట్ టైమ్స్ నౌకి తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో పట్టాలు తప్పిన వాటిలో ఎస్12 కోచ్, పక్కనే ఉన్నవి కూడా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook