Hail Rain in Hyderabad: ఎండలతో ఇబ్బందిపడుతున్న భాగ్యనగర వాసులను వరుణుడు పలకరించాడు. తీవ్ర వేడిని కాస్త ఉపశమనం కలిగించాడు. ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ముఖ్యంగా బేగంబజార్, సుల్తాన్​బజార్, అబిడ్స్, కోఠి, నాంపల్లి, బషీర్​బాగ్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, లక్డీకపూల్, గోషామహల్‌ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడింది. చంచల్​గూడ, హైదర్​గూడ, సైదాబాద్​, చంపాపేట మరియు లిబర్టీ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిటీలోని కొన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణం నెలకొంది. ఈ భారీ వర్షానికి రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి.. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. 


Also Read: Navi Mumbai: మహారాష్ట్రలో విషాదం.. వడదెబ్బకు 11 మంది మృత్యువాత.. వందలాది మందికి అస్వస్థత..


గత కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులపై వరుణుడు సడన్ గా వాన కురిపించడంతో నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నీరు ఆవిరిగా మారి వర్షం పడి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది సంవాహన వర్షపాతం రకానికి చెందినదని చెబుతున్నారు. 


Also Read: Fire Accident: హైదరాబాద్‌లో విషాదం.. చిన్నారి సహా దంపతుల సజీవ దహనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook