Navi Mumbai: మహారాష్ట్రలో విషాదం.. వడదెబ్బకు 11 మంది మృత్యువాత.. వందలాది మందికి అస్వస్థత..

Kharghar Deaths: వడదెబ్బకు 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయిలో జరిగింది. వందలాది మంది అస్వస్థతకు గురై.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 08:07 AM IST
Navi Mumbai: మహారాష్ట్రలో విషాదం.. వడదెబ్బకు 11 మంది మృత్యువాత.. వందలాది మందికి అస్వస్థత..

Maharashtra Bhushan Award Ceremony: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బ తగిలి ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నవీ ముంబైలోని ఖర్ఘర్‌లో జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షల మంది హాజరయ్యారు. ఎండ తీవ్రత తట్టుకోలేక చాలా మంది అస్వస్థతకు గురి కాగా.. 11 మంది మృతి చెందారు.  వీరంతా వడదెబ్బతోనే మరణించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. నవీ ముంబయి, పన్వేల్ లోని ఆస్పత్రుల్లో కొంత మంది చికిత్స పొందుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 

ఈ ఘటనపై సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని షిండే ప్రకటించారు. చికిత్స పొందుతున్న బాధితుల ఖర్చులను ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని షిండే స్పష్టం చేశారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు ముంబయిలోని ఓ ఆస్పత్రిని సందర్శించారు సీఎం. ఆస్పత్రిలో చేరిన బాధితులను ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే మరియు ఎన్సీపీ నేత అజిత్ పవార్ పరామర్శించారు. అంతేకాకుండా డాక్టర్లను అడిగి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 

Also Read: West Bengal: హీట్ వేవ్ ఎఫెక్ట్.. విద్యా సంస్థలకు వారం రోజులు సెలవు ప్రకటించిన మమతా బెనర్జీ!

ఈ అవార్డు కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. సామాజిక ఉద్యమకారుడు అప్పాసాహెబ్ ధర్మాధికారికి అవార్డును ప్రదానం చేసిన షా.. రూ. 25 లక్షల చెక్కును ఆయనకు అందించారు. మెుక్కలు నాటడం, బ్లడ్ క్యాంపులు నిర్వహించడం వంటివి చేయడంలో ధర్మాధికారికి మంచి పేరు ఉంది.  ఈయన 'శ్రీ సదస్య' అనే సంస్థను నిర్వహిస్తున్నారు.

Also read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ పెంపుపై ప్రకటన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News