Haj 2021: ఆ తర్వాతే హజ్ యాత్రపై నిర్ణయం: కేంద్ర మంత్రి నఖ్వీ
2021 హజ్ యాత్రపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హజ్ యాత్ర (Haj 2021) జాతీయ, అంతర్జాతీయ కోవిడ్-19 ( COVID-19 ) మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) వచ్చే ఏడాది జరిగే హజ్ యాత్రపై సోమవారం మాట్లాడారు.
Union Minister Mukhtar Abbas Naqvi clarity on Haj 2021 Yatra: న్యూఢిల్లీ: 2021 హజ్ యాత్రపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హజ్ యాత్ర (Haj 2021) జాతీయ, అంతర్జాతీయ కోవిడ్-19 ( COVID-19 ) మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) వచ్చే ఏడాది జరిగే హజ్ యాత్రపై సోమవారం మాట్లాడారు. భారత్‌తోపాటు సౌదీ అరేబియా (Saudi Arabia) నుంచి కోవిడ్ (Coronavirus) తుది మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే 2021 హజ్ యాత్రపై నిర్ణయం తీసుకోనున్నట్లు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టంచేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ( India ) కేంద్ర ప్రభుత్వం యాత్రికుల సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో.. హజ్ యాత్ర (Haj) ప్రక్రియలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని నఖ్వీ అభిప్రాయపడ్డారు. Also read: CAA: త్వరలో పౌరసత్వ సవరణ చట్టం అమలు: జేపీ నడ్డా
సోమవారం జరిగిన హజ్ యాత్ర 2021 సమీక్ష సమావేశానికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అధ్యక్షత వహించి మాట్లాడారు. 2021 హజ్ యాత్రను జూన్-జూలై నెలల్లో నిర్వహించేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు. అయితే భారత్, సౌదీ అరేబియా ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ 19 తుది మార్గదర్శకాల అనంతరం.. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దీనికి సంబంధించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని నఖ్వీ తెలిపారు. ఈ నిర్ణయం అనంతరం హజ్ కమిటీ, ఇతర భారతీయ ఏజెన్సీలు హజ్ 2021 దరఖాస్తు ప్రక్రియ, తదితర అంశాలను అధికారికంగా ప్రకటిస్తాయని నఖ్వీ స్పష్టంచేశారు.
అయితే.. భారతదేశంలో 100 శాతం డిజిటల్ హజ్ ప్రక్రియను చేపట్టినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. కోవిడ్ -19 కారణంగా ఈ ఏడాది (హజ్ యాత్ర 2020) విరమించుకున్న సుమారు 1.23 లక్షల మందికి రూ .2100 కోట్లను వారి ఖాతాల్లో ఎలాంటికోతలు విధించకుండా జమ చేసినట్లు నఖ్వీ తెలిపారు. Also read: Chinese Soldier Captured: ఇండియన్ ఆర్మీ చేతికి చిక్కిన చైనా సైనికుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe