హర్యానా: లోకం అంటే ఏమిటో కూడా తెలియని చిన్నారులు వారు. అయినా కూడా సమాజం వారిపై  కన్నెర్ర జేసింది. ఆ దుష్టులకు వావివరసలు అనేవి ఉండవు. చిన్న పిల్లలని కూడా చూడకుండా అత్యాచారం చేస్తున్నారు. తాజాగా అటుంవటి మరో ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని హిసార్లో గల ఉక్లాన్ అనే గ్రామంలో నిర్భయ ఉదంతం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై పైశాచికంగా అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా హత్యచేశారు. బాలిక ప్రవేట్ పార్టీ లో చెక్క కర్రలను ఉంచి కిరాతకానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ప్రత్యేక సిట్  బృందానికి అప్పజెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని డీసీపీ జితేందర్ తెలిపారు. నిందితులు ఒక్కరా? లేక అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తుచేస్తున్నామని.. గాలింపు చర్యలను ముమ్మరం చేశామని పేర్కొన్నారు.