Pension Scheme For Unmarried: పెళ్లికాని వారికి గుడ్‌న్యూస్.. పెన్షన్ పథకం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
Haryana CM Manohar News: రాష్ట్రంలో పెళ్లికాని వారికి పెన్షన్ పథకం అమలు చేస్తామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. 45-60 ఏళ్ల వయసు ఉన్న అవివాహితులకు పెన్షన్ అందజేస్తామని తెలిపారు. వివరాలు ఇలా..
Haryana CM Manohar News: హరియాణా రాష్ట్రంలో సరికొత్త పథకం అమలుకానుంది. ఇక నుంచి పెళ్లికాని వారికి పెన్షన్ అందజేసేందుకు వినూత్నం నిర్ణయం తీసుకుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు అవివాహితులకు పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. నెల రోజుల్లోనే ఈ పథకం అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో రాష్ట్రంలోని 45 ఏళ్లు దాటిన పెళ్లికాని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ డబ్బులు తమకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కర్నాల్‌లో జరిగిన జన్ సంవద్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఖట్టర్ హాజరయ్యారు. ఈ పథకానికి సంబంధించి తమ ప్రభుత్వం నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ గురించి 60 ఏళ్ల అవివాహిత వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పగా.. ముఖ్యమంత్రి స్పందించారు.
అవివాహితుల కోసం తమ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉందన్నారు. 45-60 ఏళ్ల వయసున్న అవివాహిత, వితంతువులకు పెన్షన్ ఇవ్వాలని చూస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా భర్త చనిపోయిన తర్వాత మహిళలకు పింఛన్ అందజేస్తుండడంతో వాళ్లకు ఆర్థికంగా చేయూత అందుతోందన్నారు. ఇక నుంచి తమ ప్రభుత్వం అలాంటి పురుషులకు కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించిందని వెల్లడించారు. అదేవిధంగా వృద్ధుల పెన్షన్‌ను 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది వచ్చే 6 నెలలకు వర్తిస్తుందని తెలిపారు. హామీ ఇచ్చినట్లు మూడు వేల పింఛన్ ఇచ్చిన హామీని నెరవేర్చామని అన్నారు.
కలంపుర గ్రామంలో సంస్కృతి మోడల్ స్కూల్‌ను నిర్మిస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు కొత్త భవనం, కచ్వా నుంచి కలంపుర వరకు రెండు నెలల్లో కొత్త రహదారి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో వాలీబాల్ గ్రౌండ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక అవివాహితులకు పెన్షన్ పథకానికి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది.
Also Read: Jonny Bairstow Controversial Run Out: ఊహించని రీతిలో బెయిర్ స్టో రనౌట్.. ఫస్ట్ టైమ్ ఇలా..
Also Read: Telangana Politics: అవినీతికి కాంగ్రెస్ రారాజు.. అందుకే రాహుల్ గాంధీ ఓడిపోయారు: మంత్రులు ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి