Haryana Exit Polls 2024: దేశంలో బీజేపీకు ఎదురుగాలి వీస్తోందా అంటే ఇవాళ జరిగిన హర్యానా, జమ్ము కశ్మీర్ పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ అదే చెబుతున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ పోల్ స్టర్స్  ఎగ్జిట్ పోల్ట్ విడుదల చేసింది. హర్యానాలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని పోల్ స్టర్స్ సహా అన్ని సంస్థలు తేల్చి చెప్పాయి.. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలో వస్తోందని వెల్లడించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోల్ స్టర్స్ సర్వే..


90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకు ఇవాళ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్ట్ చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి 55 సీట్లు సాధించనుండగా బీజేపీ 25 సీట్లకు పరిమితం కానుందని పోల్ స్టర్స్ సంస్థ తెలిపింది. ఇక ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ 3 సీట్లు, జేజేపీ 1 సీటు దక్కించుకోనుంది. ఇతరులు మరో 6 సీట్లు దక్కించుకోనున్నారు. 


ఇక దైనిక్ భాస్కర్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకు 49 సీట్లు, బీజేపీకు 24 సీట్లు రానున్నాయి. జేజేపీకు 1 సీటు, ఐఎన్ఎల్‌డికు 4 సీట్లు, ఆప్ పార్టీకు 1 సీటు రానుంది. ఇతరులు 9 సీట్లలో విజయం సాధించనున్నారు. 


ధృవ్ రీసెర్చ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 57 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో విజయం సాధించనుండగా ఇతరులు 67 స్థానాలు దక్కించుకోనున్నారు. 


పీ మార్గ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 56 స్థానాల్లోనూ, బీడేపీ 31 స్థానాల్లో విజయం సాధించనుండగా ఐఎన్ఎల్‌డి 3 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. 


పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 55 స్థానాల్లోనూ, బీజేపీ 26 స్థానాల్లోనూ విజయం సాధిస్తాయి. జేజేపీ 1 స్థానంలో, ఐఎన్ఎల్‌డి 3 స్థానాల్లో విజయం సాధిస్తాయి. ఇక ఇతరులు మరో 5 స్థానాలు కైవసం చేసుకోనున్నారు. 


మేట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో, బీజేపీ 21 స్థానాల్లో, జేజేపీ 2 స్థానాలు, ఐఎన్ఎల్‌డి 4 స్థానాలు కైవసం చేసుకోనున్నాయి. ఇతరులు మరో 4 స్థానాల్లో విజయం సాధించనున్నారు.


పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు, జేజేపీ 1 స్థానం, ఐఎన్ఎల్‌డి 3 స్థానాలు కైవసం చేసుకుంటాయి. ఇతరులు మరో 6 స్థానాల్లో విజయం సాధించనున్నారు. 


దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానా పీఠం కాంగ్రెస్ పార్టీకే కట్టబెడుతుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సాయిని మాత్రం మరోసారి బీజేపీదే అధికారమంటున్నాయి. ఇక కాంగ్రెస్ ముఖ్య నేత భూపిందర్ సింగ్ హుడా మాత్రం కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 65 సీట్లు సాధిస్తుందంటున్నారు.


Also read: Ys Jagan on Chandrababu: చంద్రబాబూ..ఇక నీవు మారవా, ఎక్స్ సాక్షిగా దుమ్మదులిపేసిన జగన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.