Hathras gang-rape case: CBI files charge sheet: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ (Hathras) లో సెప్టెంబరులో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 19ఏళ్ల దళిత యువతిపై అత్యంత పాశవికంగా అత్యచారం చేసిన ఈ ఘటనపై కుటుంబసభ్యులు, ప్రజా సంఘాలు చెప్పిన విషయాలే నిజమయ్యాయి. యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని సీబీఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులు సందీప్‌, లవకుశ్‌, రవి, రాములపై సీబీఐ ( CBI registers case ) అత్యాచారం, హత్య అభియోగాలను మోపుతూ శుక్రవారం  ఎస్సీ/ఎస్టీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. హత్రాస్ నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు అత్యాచారం కేసులు నమోదు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట అభియోగపత్రాన్ని ఉంచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ కేసు.. 
సెప్టెంబరు 14న పొలం పని చేస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, నాలుక కోసి, చిత్రహింసలకు (Hathras gang-rape case) గురిచేశారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో సెప్టెంబరు 29న కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా, వారిని అనుమతించకుండానే అదేరోజు అర్థరాత్రి 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. ఆ తరువాత ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన హత్రాస్ ఎస్పీతో సహా పలువురు పోలీసు అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో విపక్షాలు, ప్రజాసంఘాలు, కుటుంబసభ్యుల నిరసనల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం (UP Govt) సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం (Central Govt).. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కు అప్పగించింది. Also Read: Hathras Case: అందుకే అర్థరాత్రి అంత్యక్రియలు: యూపీ ప్రభుత్వం


అయితే హత్రాస్‌ నిందితులపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేయడంపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. ఈ మేరకు ప్రియాంక ‘సత్యమేవ జయతే’ అంటూ ట్విట్‌ చేశారు. Also Read : Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook